ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంత్రి నారా లోకేష్‌పై (Nara Lokesh) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా (RK Roja) సంచలన ఆరోపణలు చేశారు. ‘లోకేష్ రైజింగ్ స్టార్ (Rising Star) కాదని.. స్కామ్ స్టార్ (Scam Star)’ అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతిలో రైజింగ్ స్టార్‌గా ఎదిగారని విమర్శించారు.
రెడ్‌బుక్ రాజ్యాంగంతో(Red Book Constitution) సైకో పనులు చేస్తున్నారని రోజా ఆరోపించారు. 3.5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును లోకేష్ తన అవినీతి, స్కామ్‌ల కోసం ఉపయోగించుకున్నారని ఆమె విమర్శించారు. అవినీతి ద్వారా వచ్చిన డబ్బుతో విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారని.. ఆ సొమ్మును విదేశాల్లో దాచిపెట్టేందుకే వెళ్తున్నారని ఆరోపించారు.
దొంగ సర్టిఫికెట్లతో లక్షలాది రూపాయలు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారని రోజా ఆరోపించారు. పేకాట ఆడేవారికి సైతం డీఎస్సీ(DSC) ద్వారా ఉద్యోగాలు ఇచ్చారంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
డీఎస్సీ నియామకాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని రోజా డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) రాజీనామా చేయాలని ఆమె అన్నారు. విద్యార్థుల తరఫున తాము ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
గతంలో వైఎస్ జగన్‌పై(YS Jagan) వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించారని రోజా గుర్తుచేశారు. ఆ కేసుల్లో జగన్‌కు క్లీన్‌చిట్ వచ్చిందని అన్నారు. మరి లోకేష్‌పై(Nara Lokesh) వస్తున్న ఆరోపణల విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించడం లేదని ఆమె ప్రశ్నించారు.
లోకేష్‌పై నమ్మకం లేకపోవడం వల్లే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఈ వ్యవహారంపై మౌనంగా ఉన్నారని రోజా విమర్శించారు. డీఎస్సీ నియామకాలపై సమగ్ర విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.






