---Advertisement---

Sachin Tendulkar: ఏయూ విద్యార్థులకు సచిన్ సందేశం.. ఆత్మవిశ్వాసమే విజయ రహస్యం!

April 27, 2026

---Advertisement---

ఆంధ్రయూనివర్సిటీ (AU) శతాబ్ధి ఉత్సవాల్లో (Centenary Celebrations) పాల్గొన్న భారత క్రికెట్ దిగ్గజం (Indian Cricket Legend) సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) విద్యార్థులకు (Students) ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. ఏయూ నుంచి చదివి వచ్చిన వారు అనేక రంగాల్లో గొప్ప విజయాలు సాధించారని కొనియాడారు. విద్య, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే జీవితంలో ఎవరైనా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తన చిన్ననాటి జీవితం గురించి సచిన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన తండ్రి(Father) ఒక ప్రొఫెసర్ (Professor) అని, ఆయనకు చదువుపై అపారమైన ఆసక్తి ఉండేదని తెలిపారు. కుటుంబం మొత్తం 2 గదుల చిన్న ఇంట్లోనే జీవించేదని, సాధారణ జీవన విధానమే తమకు విలువలు నేర్పిందని గుర్తుచేశారు.

క్రికెట్‌లో గుర్తింపు వచ్చిన తర్వాతే తాను మొదటి కారు కొనుగోలు చేశానని సచిన్ చెప్పారు. విజయానికి ముందు కష్టాలు సహజమని, ప్రతి ఒక్కరూ తమ పనిపై పూర్తి దృష్టి పెట్టాలని సూచించారు. ఒత్తిడులు వచ్చినా లక్ష్యంపై ఫోకస్ ఉంచితే వాటిని సులభంగా అధిగమించవచ్చన్నారు.

నెట్స్‌లో గంటల తరబడి సాధన చేసేవాడినని, లక్ష్యం దగ్గరపడే సమయంలో అనేక సందేహాలు వచ్చేవని సచిన్ వెల్లడించారు. అయితే ఆత్మవిశ్వాసం, కఠోర శ్రమ, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని విద్యార్థులకు సందేశం ఇచ్చారు. సచిన్ ప్రసంగం సభలో ఉన్న యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment