---Advertisement---

కస్టోడియల్ డెత్ కేసులో… రాజీ బేరాల ఆరోపణలు.. జనసేన నాయకుడిని చిక్కుల్లో పడేస్తాయా?

June 24, 2026

Summarize with AI

---Advertisement---

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) కస్టోడియల్ డెత్ కేసు (Custodial Death Case) కొత్త మలుపులు తిరుగుతోంది. సాయికృష్ణది సాధారణ మిస్సింగ్ కేసు కాదని, అది కస్టోడియల్ డెత్ కేసు అని దర్యాప్తు బృందం(SIT) కోర్టుకు నివేదిక సమర్పించిన నేపథ్యంలో రాజకీయంగా కూడా తీవ్ర చర్చ సాగుతోంది.

ఈ కేసులో జనసేన (Jana Sena) నాయకుడు అమ్మిశెట్టి వాసుపై (Ammishetty Vasu) వచ్చిన ఆరోపణలు ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. బాధిత కుటుంబ సభ్యులతో రాజీ బేరాలకు ప్రయత్నించారని, డబ్బులు ఆశ చూపారని, అలాగే కుల ప్రస్తావన తీసుకువచ్చి నిందితులను కాపాడాలని సూచించారని బాధిత కుటుంబ సభ్యుడు మీడియా ముందు ఆరోపించడం నాడే చర్చనీయాంశమైంది.

ఈ నేపథ్యంలో హత్య లేదా కస్టోడియల్ డెత్ వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో రాజీ ప్రయత్నాలు చట్టపరంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయన్న అంశంపై చర్చ మొదలైంది. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, హత్య వంటి నాన్-కాంపౌండబుల్ నేరాల్లో బాధిత కుటుంబంతో రాజీ కుదర్చేందుకు ప్రయత్నించడం, నిందితులను రక్షించే ఉద్దేశంతో వ్యవహరించడం లేదా సాక్ష్యాలను ప్రభావితం చేయడం వంటి చర్యలు చట్టపరమైన విచారణకు లోబడి ఉండవచ్చని చెబుతున్నారు.

భారతీయ న్యాయ సంహిత లోని కొన్ని నిబంధనల ప్రకారం నిందితులను రక్షించే ప్రయత్నాలు, సాక్ష్యాలను ప్రభావితం చేయడం, కుట్రలో భాగస్వామ్యం కావడం వంటి అంశాలు నిరూపితమైతే సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే అవి వర్తించాలంటే దర్యాప్తులో తగిన ఆధారాలు బయటపడాల్సి ఉంటుందని భాదిత కుటుంభం మీడియా ముఖంగా చెప్పిన మాటలే ఆధారంగా సరిపోతాయని అంటున్నారు.

ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంలో ప్రభుత్వం మరియు దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. సాయికృష్ణ కేసులో వెలుగులోకి వస్తున్న అంశాల నేపథ్యంలో బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై సమగ్ర విచారణ జరపాలని పలువురు ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆరోపణలపై జనసేన పార్టీ కూడా స్పష్టమైన వైఖరి ప్రకటించాలని కోరుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment