---Advertisement---

సచివాలయ ఉద్యోగులపై పోలీసుల దాడి.. కాకర్ల వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

September 27, 2026

Summarize with AI

---Advertisement---

గ్రామ (Village), వార్డు (Ward) సచివాలయ ఉద్యోగులపై (Secretariat Employees) పోలీసులు(Police) వ్యవహరించిన తీరును ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి(Kakarla Venkatramireddy) తీవ్రంగా తప్పుపట్టారు. తారురోడ్డుపై మహిళా ఉద్యోగులను (Women Employees) లాక్కెళ్లడం అమానుషమని, ఉద్యోగులను గౌరవంగా చూసుకోవాల్సిన ప్రభుత్వం ఇలా వ్యవహరించడం సరికాదని అన్నారు. ధర్నా చౌక్‌లో టెంట్ వేసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించారు.

చిన్న వయసులోనే ఉద్యోగులు హార్ట్‌ఎటాక్‌తో(Heart Attack) మృతి చెందుతున్నారని, ప్రభుత్వ వేధింపులు(Government Harassment), పని ఒత్తిడి కూడా ఇందుకు కారణమవుతున్నాయని కాకర్ల వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. రోజుకో సర్వే పేరుతో ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని, యోగాంధ్ర (Yoga Andhra) కార్యక్రమాల సమయంలో యోగా గురువులుగా, పీ4 కార్యక్రమంలో(P4 Program) కుటుంబాల దత్తత పేరుతో, ఉత్సవాల సమయంలో టాయిలెట్ల వద్ద, పెట్రోలు కొరత సమయంలో బంకుల వద్ద విధులు అప్పగిస్తున్నారని విమర్శించారు.

పండుగలు, ఆదివారాలు అనే తేడా లేకుండా వివిధ పనులకు ఉద్యోగులను రోడ్లపై తిప్పుతున్నారని, కార్యాలయ విధులకు బదులుగా వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంతటి వేధింపులకు గురిచేయలేదని వ్యాఖ్యానించారు. పోలీసులూ తమ తోటి ఉద్యోగులపై కర్కశంగా వ్యవహరించవద్దని కోరారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నిర్వహించిన ధర్నా అన్ని అడ్డంకులను అధిగమించి విజయవంతమైందని కాకర్ల వెంకట్రామిరెడ్డి అన్నారు. ధర్నాకు వచ్చిన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే సహించబోమని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని పేర్కొన్నారు. వైఎస్ జగన్(YS Jagan) తీసుకొచ్చిన వ్యవస్థ కావడం వల్లే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై కక్ష సాధింపు జరుగుతోందా? అనే ప్రశ్నను కూడా ఆయన లేవనెత్తారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment