వైసీపీ(YSRCP) మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు (Sidhiri Appalaraju) ఎట్టకేలకు ఊరట లభించింది. సోంపేట కోర్టు (Sompeta Court) ఆయనకు బెయిల్(Bail) మంజూరు చేసింది. దీంతో 23 రోజులుగా జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న అప్పలరాజు బయటకు రానున్నారు.
అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ (Aarav Varma) కారు నడుపుతూ చేసిన ప్రమాదంలో ఓ గొర్రెల కాపరి (Shepherd) మృతి చెందిన ఘటనకు సంబంధించిన కేసులో అప్పలరాజుపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో భాగంగా పోలీసులు జులై 22న అప్పలరాజును అరెస్ట్ చేసి జైలుకు(Jail) తరలించారు. అప్పటి నుంచి ఆయన జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఆయన తరఫు న్యాయవాదులు పలుమార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ.. కోర్టు విచారణను వాయిదా వేస్తూ వచ్చింది.
మరోవైపు అప్పలరాజును విచారించేందుకు తమకు కస్టడీ ఇవ్వాలని కాశీబుగ్గ పోలీసులు కోర్టును కోరారు. అయితే పోలీసుల కస్టడీ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.
తాజాగా సోంపేట కోర్టు అప్పలరాజుకు బెయిల్ మంజూరు చేయడంతో వైసీపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. 23 రోజుల రిమాండ్ అనంతరం ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు.






