---Advertisement---

సీఎం చంద్రబాబుతో మాట్లాడిన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య..!

July 27, 2026

Summarize with AI

---Advertisement---

పోలవరం (Polavaram) జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రంపచోడవరం (Rampachodavaram) మండలానికి చెందిన పదో తరగతి విద్యార్థిని (10th Class Student) ముర్రం శివాని (Murram Shivani) ఉరివేసుకుని మృతి చెందడంతో ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో (Mega Parent-Teacher Meeting) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో (CM Nara Chandrababu Naidu) నేరుగా మాట్లాడిన విద్యార్థినే కావడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆమె ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

రంపచోడవరం మండలం ఇర్లపల్లి కొత్త కాలనీకి చెందిన శివాని స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం ఇంటి సమీపంలోని రేకుల షెడ్‌లో ఉరివేసుకున్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు(Police) అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను విచారిస్తూ అసలు కారణాలపై ఆరా తీస్తున్నారు.

ఈ నెల 24న రంపచోడవరంలో జరిగిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ కార్యక్రమంలో సీఎం పక్కనే కూర్చొని ధైర్యంగా మాట్లాడిన విద్యార్థినే శివాని కావడం ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. కేవలం 2 రోజుల వ్యవధిలోనే ఆమె మృతి చెందడం స్థానిక ప్రజలు, విద్యార్థులు(Students), ఉపాధ్యాయులను (Teachers) తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

శివాని మృతిపై గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె ఆత్మహత్య వెనుక వ్యక్తిగత కారణాలా, ఇతర ఒత్తిళ్లా అనే అంశాలపై పోలీసులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment