ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసుకు (Sugali Preethi Case) తొమ్మిదేళ్లు గడిచినా న్యాయం కోసం తన పోరాటం కొనసాగుతూనే ఉందని బాధితురాలి తల్లి(Mother) పార్వతి దేవి (Parvathi Devi) తెలిపారు. 2017లో జరిగిన ఈ ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను (Promises) నిలబెట్టుకోలేదని ఆమె డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తన పోరాటం వల్లే సుగాలి ప్రీతి కుటుంబానికి పరిహారం, భూమి, ఇంటి స్థలం, ఉద్యోగం లభించాయని చెబుతున్నప్పటికీ, వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయని పార్వతి దేవి పేర్కొన్నారు. తనకు 2013లోనే వికలాంగుల కోటాలో మెడికల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చిందని, జగన్ ప్రభుత్వం (Jagan Government) 2021 నవంబర్‌లో చట్టప్రకారం రావాల్సిన రూ.8 లక్షల ఆర్థిక సహాయం, 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, అలాగే తన భర్తకు ఉద్యోగం కల్పించిందని ఆమె వివరించారు. ఈ అంశాలపై తప్పుడు ప్రచారం చేస్తూ తనపై బురద జల్లుతున్నారని ఆమె ఆరోపించారు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 2019 అక్టోబర్‌లో అదనపు ఎస్పీ రమాదేవి (SP Rama Devi) నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)(SIT) ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించిందని ఆమె గుర్తుచేశారు. అయితే 2020లో పవన్ కళ్యాణ్ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారని, అప్పటికే 2017–2019 మధ్యకాలంలో సాక్ష్యాధారాలు దెబ్బతిన్నాయని కానీ అవి జగన్ పాలనలో దెబ్బతిన్నాయని పవన్ కళ్యాణ్ చెప్పడం రాజకీయ దురుద్దేశంతోనే అని చెప్పుకొచ్చారు. ఇటీవల సీబీఐ కూడా తమ వద్ద వనరుల కొరత కారణంగా ఈ కేసు దర్యాప్తు చేపట్టలేమని కోర్టుకు తెలిపిన విషయం కూడా ఆమే ప్రస్తావనకు తెచ్చారు.
ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి ప్రీతి కేసుపై తొలి సంతకం (First Signature) చేస్తానని, నిందితులను శిక్షించే వరకు పోరాడుతానని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హామీ ఇచ్చారని, కానీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత తన వైఖరిని పూర్తిగా మార్చుకున్నారని పార్వతి దేవి ఆరోపించారు. సాక్ష్యాధారాల మార్పిడి జరిగిందని చెబుతూ ఇప్పుడు చర్యలు తీసుకోలేమని చెప్పడం బాధ్యతారాహిత్యమని ఆమె విమర్శించారు. సాక్ష్యాల ధ్వంసం టీడీపీ(TDP) ప్రభుత్వ హయాంలోనే జరిగిందని ఆమె అన్నారు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తనను నమ్మించి మోసం చేశారని, తన కుమార్తె మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకున్నారని ఆరోపిస్తూ గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై చీటింగ్, నమ్మకద్రోహం వంటి సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆ ఫిర్యాదు చేసినప్పటి నుంచి జనసేన కార్యకర్తలు, సోషల్ మీడియా విభాగానికి చెందిన వ్యక్తులు తనపై ట్రోలింగ్ చేస్తున్నారని, డిజిటల్ వేదికల్లో వ్యక్తిగత దాడులు చేస్తూ మానసికంగా వేధిస్తున్నారని పార్వతి దేవి ఆవేదన వ్యక్తం చేశారు.
“న్యాయం కోరితే ఎదురుదాడి చేస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వంలో ప్రజలకు లభించే న్యాయమేనా?” అని ఆమె ప్రశ్నించారు. తన కుమార్తె వర్ధంతి సందర్భంగా వీల్‌చైర్ యాత్ర నిర్వహించాలని భావించినా పోలీసులు అనుమతి ఇవ్వకుండా గృహనిర్బంధం చేశారని ఆమె ఆరోపించారు. తన కుమార్తె మరణాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుని, ఇప్పుడు నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని పవన్ కళ్యాణ్‌పై ఆమె తీవ్ర విమర్శలు చేశారు.






