---Advertisement---

విద్యార్థులకు నాణ్యమైన విద్యను నిరాకరించడం సరికాదు.. తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు!

September 17, 2026

Summarize with AI

---Advertisement---

తమిళనాడులో(Tamil Nadu) జవహర్ నవోదయ విద్యాలయాల (Jawahar Navodaya Vidyalayas) ఏర్పాటు అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు (Madras High Court) ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu Government) దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బి.వి. నాగరత్న(Justice B.V. Nagarathna), జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో (Justice R. Mahadevan) కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

నవోదయ విద్యాలయాల ద్వారా హిందీ భాషను(Hindi Language) విద్యార్థులపై (Students) బలవంతంగా రుద్దుతున్నారన్న తమిళనాడు ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. త్రిభాషా విధానంలో(Three-Language Policy) ప్రాంతీయ భాష, ఆంగ్ల భాషతో పాటు మరో భారతీయ భాషను కూడా బోధించే అవకాశం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. మూడో భాషగా హిందీనే తప్పనిసరిగా బోధించాలనే నిబంధన లేదని పేర్కొంది.

నవోదయ విద్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం (Central Government) పూర్తి స్థాయిలో నిధులు అందిస్తున్న నేపథ్యంలో, పాఠశాలల ఏర్పాటుకు అవసరమైన భూమిని (Required Land) కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిరాకరిస్తోందని ధర్మాసనం ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వ పథకం అన్న కారణంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే అవకాశాన్ని నిరాకరించడం సమంజసం కాదని వ్యాఖ్యానించింది.

విద్యార్థులపై భాషా విద్యకు సంబంధించిన ఒత్తిడిని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది. మూడో భాషను 9వ తరగతి నుంచి ప్రారంభించడం కంటే 5వ లేదా 6వ తరగతి నుంచే బోధన ప్రారంభించి, ఆ భాషా విద్యను ముందుగానే పూర్తిచేసే విధంగా విధానాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

నవోదయ విద్యాలయాల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment