ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) సంచలనం రేపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు (Guntur) కృష్ణబాబు కాలనీలో (Krishnababu Colony) ఈ నెల 15న ఇంటి ముందు కుళాయి నుంచి మోటార్ ద్వారా నీళ్లు పట్టుకుంటున్న ఓ మహిళతో(Women) 21వ డివిజన్ తెలుగుదేశం పార్టీ(TDP) కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి (Mallela Venkataramanamurthy) వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డాడు.
ఆ వాగ్వాదం అనంతరం మహిళను, ఆమె కుటుంబ సభ్యుడిని వెంటపడి దాడి చేసినట్లు, మహిళను నడిరోడ్డుపై వివస్త్రను(Stripped) చేసి తీవ్రంగా అవమానించినట్లు సీసీ టీవీ ఫూటేజ్ లో రికార్డ్ అయింది. దీంతో ఈ ఘటనలో వెంకటరమణమూర్తితో పాటు అతని సోదరి, మరికొందరు కూడా పాల్గొన్నట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఎంత వేడుకున్నా కనికరం లేకుండా దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. స్థానికంగా ప్రజలు, వివిధ వర్గాలు ఈ ఘటనను ఖండించారు. విషయం తీవ్రత దృష్ట్యా ప్రజల్లో వ్యతిరేకత రావడంతో స్థానిక ఎమ్మెల్యే గళ్ల మాధవి (MLA Galla Madhavi) స్పందించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత మల్లెల వెంకటరమణమూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ, సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు ప్రకటించారు.
బాధితురాలి ఫిర్యాదు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు వెంకటరమణమూర్తి, అతని సోదరితో పాటు మొత్తం 9 మందిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.







