---Advertisement---

తెలంగాణలో భారీ వర్షాలతో నిండుతున్న ప్రాజెక్టులు.. రైతుల్లో ఆనందం!

July 30, 2026

Summarize with AI

---Advertisement---

తెలంగాణ (Telangana) వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు (Heavy Rains) రాష్ట్రానికి ఊరటనిస్తున్నాయి. ఎగువ ప్రాంతాలైన తెలంగాణ(Telangana), మహారాష్ట్రల్లో (Maharashtra) కురుస్తున్న వర్షాలతో గోదావరి(Godavari), ప్రాణహిత నదులు (Rivers) ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. జలాశయాలు నిండుకుండలా మారుతుండటంతో రైతులు, ప్రజల్లో ఆనందం నెలకొంది.

నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు (Sriram Sagar Project) వరద ప్రవాహం రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 12,900 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతుండగా, నీటి నిల్వ 17.103 టీఎంసీలకు చేరుకుంది. కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదే సమయంలో నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు నీటి నిల్వ అర టీఎంసీ దాటగా, ఇన్ ఫ్లో దాదాపు 10,000 క్యూసెక్కులకు చేరింది.

నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు (Kadem Project) వద్ద వరద ఉధృతి మరింత పెరిగింది. ఉదయం 11:00 గంటల సమయానికి ప్రాజెక్టులోకి 77,442 క్యూసెక్కుల భారీ ఇన్ ఫ్లో నమోదైంది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు 6 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వరద ప్రవాహంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో అప్రమత్త చర్యలు కొనసాగుతున్నాయి.

జయశంకర్ (Jayashankar) భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం (Kaleshwaram) వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అక్కడ నీటిమట్టం 6.320 మీటర్లకు చేరడంతో నది తీరం పూర్తిగా మారిపోయింది. గోదావరి ప్రవాహం పెరగడంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌కు (Medigadda Lakshmi Barrage) భారీగా వరద నీరు చేరుతోంది. ఎన్డీఎస్ఏ మార్గదర్శకాలను అనుసరిస్తూ అధికారులు బ్యారేజ్‌లోని మొత్తం 85 గేట్లను ఎత్తి ఉంచారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో రెండూ 1,01,530 క్యూసెక్కులుగా కొనసాగుతున్నాయి.

రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు వేగంగా పెరుగుతుండటంతో సాగునీటి పరిస్థితిపై ఆశలు పెరుగుతున్నాయి. నీటిపారుదల శాఖ అధికారులు అన్ని ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా వర్షాలు కొనసాగనున్న నేపథ్యంలో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment