తెలంగాణలో ఇంటర్మీడియట్ (Telangana State Board of Intermediate Education) ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు (K. Keshava Rao), ప్రభుత్వ కార్యదర్శి యోగితా రాణా (Yogita Rana) ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను ప్రకటించారు. ఈసారి మొత్తం పాస్ శాతం 66.20గా నమోదైంది. నాలుగు లక్షలకు పైగా విద్యార్థులు ఫెయిల్ అయినట్లు వెల్లడించారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆతురపడి ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకూడదని సూచించారు.
ఫస్టియర్, సెకండియర్ ఫలితాల వివరాలు
ఫస్టియర్‌లో (First Year) 3,23,807 మంది విద్యార్థులు 66.20 శాతం పాస్ కాగా, సెకండియర్‌లో (Second Year) 3,58,490 మంది విద్యార్థులు 70 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈసారి కూడా బాలికలు మెరుగైన ఫలితాలు సాధించారు. 74.4 శాతం బాలికలు పాస్ కాగా, బాలుర పాస్ శాతం 57.69గా నమోదైంది. జిల్లాల వారీగా ఫస్టియర్‌లో మేడ్చల్ జిల్లా ముందుండగా, సెకండియర్‌లో భూపాలపల్లి జిల్లా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు.
ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 9.5 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు.
రిజల్ట్స్ ఎలా చెక్ చేయాలి
విద్యార్థులు అధికారిక వెబ్సైట్లలో తమ ఫలితాలను చూసుకోవచ్చు
https://tgbie.cgg.gov.in
https://results.cgg.gov.in
అదనంగా వాట్సప్ (WhatsApp) ద్వారా కూడా ఫలితాలు పొందే అవకాశం ఉంది. 8096958096 నంబర్‌కు హై అని మెసేజ్ చేసి, తర్వాత “బీఐఈ ఎగ్జామ్ రిజల్ట్” (BIE Exam Result) అని టైప్ చేసి పంపితే ఫలితాలు వాట్సప్‌లో అందుతాయి.
గత 12 సంవత్సరాలతో పోలిస్తే ఈసారి ఇంటర్ ఫలితాలను రికార్డు సమయంలో విడుదల చేశారు. పరీక్షలు ముగిసిన నెల రోజుల్లోపే ఫలితాలు ప్రకటించడం విశేషం. గత సంవత్సరాల్లో ఫలితాల విడుదల తేదీలు చూస్తే ఈసారి వేగంగా ప్రకటించినట్లు తెలుస్తోంది.






