తెలంగాణ రాజకీయాల్లో(Telangana Politics) కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంత్రి కొండా సురేఖను(Minister Konda Surekha) మంత్రివర్గం నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు గవర్నర్‌కు(Governor) సిఫార్సు కూడా పంపినట్లు తెలుస్తోంది.
మరోవైపు తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా కొనసాగుతున్న డాక్టర్ జి. చిన్నారెడ్డి (Dr. G. Chinna Reddy) నియామకాన్ని తక్షణమే రద్దు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు సమాచారం. ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని (Gadwal Vijayalakshmi) తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా నియమించినట్లు తెలుస్తోంది.
ఇక హైదరాబాద్‌లోని (Hyderabad) తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నీరెల్లా శారదను నియమించేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ నియామకానికి సంబంధించిన అధికారిక ప్రక్రియ త్వరలో పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా కాకతీయ పట్టణ అభివృద్ధి ప్రాధికార సంస్థ ఛైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ ఎంపీ జి. సుధా రాణిని(G. Sudha Rani) నియమించేందుకు కూడా ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినట్లు సమాచారం.
తాజా పరిణామాలతో తెలంగాణ మంత్రివర్గంతో పాటు పలు కీలక నామినేటెడ్ పదవుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నిర్ణయాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.
అయితే మంత్రి పదవి నుంచి తొలగింపు, కొత్త నియామకాలకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాతే పూర్తి వివరాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.








కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ ఫైర్.. ‘ప్రజా పీడన’ అంటూ ఛార్జ్‌షీట్ విడుదల!