---Advertisement---

లడ్డూ వివాదంలో కీలక మలుపు.. జంతువుల కొవ్వు లేదని మరోసారి తేల్చిన సీబీఐ సిట్‌

October 7, 2026

Summarize with AI

---Advertisement---

తిరుమల శ్రీవారి లడ్డూలో(Tirumala Srivari Laddu) జంతువుల కొవ్వు(Animal Fat) కలిసిందన్న ఆరోపణలపై దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ కాలేదని సీబీఐ(CBI) నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)(SIT) దాఖలు చేసిన అదనపు ఛార్జిషీట్‌లో(Additional Charge Sheet) పేర్కొంది. నెల్లూరు కోర్టులో దాఖలు చేసిన ప్రధాన ఛార్జిషీట్‌లోనూ ఇదే విషయాన్ని సిట్‌ గతంలో వెల్లడించింది.

ఏఆర్‌ డెయిరీకి (AR Dairy) చెందిన నాలుగు నెయ్యి ట్యాంకర్ల నుంచి సేకరించిన నమూనాలను హరియాణాలోని నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌డీఆర్‌ఐ)లో(NDRI) పరీక్షించగా, జంతువుల కొవ్వు ఉన్నట్లు తేలలేదని సిట్‌ తెలిపింది. అలాగే మైసూరులోని సీఎఫ్‌టీఆర్‌ఐ (CFTRI) ల్యాబ్‌లో పరీక్షించిన బోలే బాబా డెయిరీ నెయ్యి నమూనాల్లోనూ జంతు కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ కాలేదని పేర్కొంది.

ఇదే అంశంపై గతంలో సమర్పించిన దర్యాప్తు వివరాల్లోనూ నెయ్యిలో జంతు కొవ్వు ఉన్నట్లు ఆధారాలు లేవని సిట్‌ పేర్కొంది. దీంతో తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంపై సాగిన ఆరోపణలు, దర్యాప్తులో వెలుగుచూసిన శాస్త్రీయ పరీక్షల ఫలితాల మధ్య తేడా మరోసారి చర్చకు వచ్చింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment