---Advertisement---

ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త ట్విస్ట్.. విచారణలో కీలక ఆధారాలు స్వాధీనం!

August 3, 2026

Summarize with AI

---Advertisement---

ట్రైనీ మహిళా ఐపీఎస్ (Trainee Woman IPS) అధికారిణి ఫిర్యాదుతో నమోదైన కేసులో దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy) నివాసంలో పోలీసులు సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ (Scene Reconstruction) నిర్వహించి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో విచారణలో మరో మహిళతో కూడా అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో ఈ కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

హైదరాబాద్‌లోని (Hyderabad) అశోక్ నగర్‌లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి గదిలో(Room) పోలీసులు సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేపట్టారు. ఈ సందర్భంగా గదిలో నుంచి 2 ప్రేమలేఖలు(Love Letters), 1 ల్యాప్‌టాప్ (Laptop), 1 సెల్‌ఫోన్(Cell Phone), 1 కత్తిని (Knife) స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించిన పోలీసులు, వాటి ఆధారంగా కేసు దర్యాప్తును మరింత లోతుగా కొనసాగిస్తున్నారు.

విచారణలో మరో కీలక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు(Andhra Pradesh) చెందిన ఓ వివాహిత మహిళతో ఉదయ్ కృష్ణారెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భర్తతో విడిపోయిన తర్వాత హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న ఆ మహిళతో అతడు సన్నిహితంగా ఉన్నట్లు సమాచారం. అయితే విడాకుల తర్వాత తనతో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండాలని ఉదయ్ చేసిన ప్రతిపాదనను ఆమె తిరస్కరించినట్లు విచారణలో వెల్లడైంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణి, ఆ మహిళ ఇద్దరూ కలుసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డి ప్రవర్తనపై ఇద్దరూ తమ అనుభవాలు, ఎదురైన ఇబ్బందులను ఒకరితో ఒకరు పంచుకున్నట్లు తెలుస్తోంది. ట్రైనీ ఐపీఎస్ అధికారిణి గదిలోకి బలవంతంగా ప్రవేశించి ఆమె మొబైల్ ఫోన్‌ను లాక్కున్నాడనే ఆరోపణలపై కూడా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు సుమారు 20 మంది వాంగ్మూలాలను నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment