---Advertisement---

మంత్రి అనుచరుడి మొసం.. విజయవాడలో గిరిజనుల భారీ నిరసన.

August 7, 2026

Summarize with AI

---Advertisement---

విజయవాడలో (Vijayawada) గిరిజనుల (Tribal people) భారీ నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) ముఖ్య అనుచరుడిగా పేర్కొంటున్న పామర్తి రాజా తమతో నెలల తరబడి పనులు చేయించుకుని సుమారు రూ.1.50 కోట్ల వేతనాలు చెల్లించకుండా మోసం చేశాడని బాధిత గిరిజనులు (Affected tribal people) ఆరోపించారు. సుమారు 200 మంది గిరిజనులు తమకు రావాల్సిన కూలీ బకాయిలు ఇప్పటికీ అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాధితుల కథనం ప్రకారం, ఈ విషయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన రాలేదని వారు ఆరోపిస్తున్నారు. తమ బాధను కనకదుర్గమ్మ అమ్మవారికి (Kanaka Durga Ammavaru) వినిపించి న్యాయం కోరేందుకు విజయవాడలో (Vijayawada) ర్యాలీ చేపట్టగా, ఇబ్రహీంపట్నం పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన గిరిజనులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

ఇదే సమస్యపై సుమారు రెండు నెలల క్రితం కూడా ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం(Mylavaram constituency), జి.కొండూరు మండలం కట్టుబడి పాలెం గ్రామానికి చెందిన గిరిజనులు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ(TDP) కేంద్ర కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తమతో పనులు చేయించుకుని వేతనాలు చెల్లించకుండా మోసం చేశారని పామర్తి రాజాపై అప్పుడే ఆరోపణలు చేశారు.

డబ్బుల కోసం ఎన్నిసార్లు పామర్తి రాజాను సంప్రదించినా ఫలితం లేకపోగా, తమను అవమానపరిచారని గిరిజనులు ఆరోపించారు. తమ కష్టార్జితాన్ని చెల్లించే వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేస్తూ టీడీపీ(TDP) కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. అయితే ఆ సమయంలో పార్టీ నాయకులు లేదా ప్రభుత్వ ప్రతినిధుల నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో, ఇప్పుడు మరోసారి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వరకు పాదయాత్ర చేపట్టి తమ నిరసనను కొనసాగించినట్లు తెలుస్తుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment