---Advertisement---

జగన్ పాలనలో రికార్డు స్థాయిలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు.. రెండేళ్లుగా మౌలిక వసతులు పెండింగ్?

September 16, 2026

Summarize with AI

---Advertisement---

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) హయాంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న టీటీడీ ఉద్యోగుల (TTD Employees) సొంతింటి కలకు(Own House Dream) పరిష్కారం లభించిందని వైఎస్సార్‌సీపీ(YSRCP) పేర్కొంటోంది. 2023 సెప్టెంబర్ 18న తిరుపతిలో (Tirupati) రూ.313 కోట్ల వ్యయంతో 3,518 మంది టీటీడీ ఉద్యోగులకు తొలి విడతగా ఇళ్ల స్థలాల పట్టాలను (House Plots) పంపిణీ చేశారు. వడమాలపేట మండలం పాదిరేడు వద్ద 300 ఎకరాలకు పైగా భూమిని కేటాయించడంతో పాటు, పాగిలి పరిధిలో మరో 300 ఎకరాల భూమిని సేకరించి లేఅవుట్ల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. మూడు దశల్లో కలిపి ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది, పెన్షనర్లకు దాదాపు 9,000 ఇళ్ల స్థలాలు కేటాయించినట్లు సమాచారం. పాదిరేడు లేఅవుట్‌లో ఫేజ్-1లో 3,518, ఫేజ్-2లో 1,703 ప్లాట్లు కలిపి మొత్తం 5,192 ప్లాట్లు పంపిణీ చేశారు.

అయితే స్థలాల కేటాయింపు పూర్తయిన తర్వాత రోడ్లు(Roads), విద్యుత్(Electricity), నీరు (Water) వంటి మౌలిక వసతుల అభివృద్ధి విషయంలో జాప్యం జరుగుతోందనే ఆందోళనలు లబ్ధిదారుల్లో వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం(Coalition Government) అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిన నేపథ్యంలో పాదిరేడు లేఅవుట్‌లో అభివృద్ధి పనుల కోసం తాజాగా రూ.230 కోట్ల ప్రణాళికకు టీటీడీ పాలకమండలి (TTD Board) ఆమోదం తెలిపింది. అండర్‌గ్రౌండ్ విద్యుత్, తారు రోడ్లు తదితర పనులు ఇప్పటికీ ప్రణాళిక, ఆమోద దశలను దాటలేదనే విమర్శలు ఉన్నాయి.

ఏళ్ల తరబడి ఎదురుచూసిన టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు అందినప్పటికీ, వాటిపై ఇళ్లు నిర్మించుకునేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావడంలో జాప్యం ఎందుకు జరుగుతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో వేలాది మంది ఉద్యోగులు, విశ్రాంత సిబ్బంది ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రోడ్లు, నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల పనులను వేగంగా పూర్తి చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment