యూపీఐ(UPI)లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం (Central Government) తీసుకున్న తాజా నిర్ణయంపై కాంగ్రెస్ (Congress) తీవ్రంగా మండిపడింది. లోక్‌సభలో(Lok Sabha) ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. యూపీఐ చెల్లింపులపై (UPI Payments) రుసుములు (Charges) విధించేందుకు ప్రభుత్వం నిశ్శబ్దంగా మార్గం సుగమం చేస్తోందని ఆరోపించారు.
రూ.2,000కు మించిన వ్యాపారి యూపీఐ లావాదేవీలపై వ్యాపారి రాయితీ రుసుము విధించే అవకాశం కల్పించిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇలాంటి లావాదేవీలు సంఖ్య పరంగా కేవలం 5 శాతం ఉన్నప్పటికీ.. మొత్తం యూపీఐ లావాదేవీల విలువలో దాదాపు 65 శాతం వాటా కలిగి ఉన్నాయని తెలిపారు.
मोदी सरकार ने चुपचाप UPI पर फ़ीस लगाने का रास्ता खोल दिया है।
— Rahul Gandhi (@RahulGandhi) September 15, 2026
अब ₹2,000 से ऊपर के merchant UPI लेन-देन पर MDR लगाया जा सकता है। इन ट्रांजैक्शंस की संख्या भले ही सिर्फ़ 5% हो, लेकिन UPI के कुल transaction value का करीब 65% इन्हीं में है।
सरकार कहती है कि ग्राहक से कोई फ़ीस नहीं…
కేంద్ర ప్రభుత్వం రూ.2,000 వరకు జరిగే యూపీఐ లావాదేవీలపై బ్యాంకులు, చెల్లింపు వ్యవస్థల సంస్థలు ఎలాంటి రుసుములు విధించకూడదని స్పష్టం చేసింది. రూపే డెబిట్ కార్డు (RuPay Debit Card) చెల్లింపులపైనా రుసుములు ఉండకూడదని ఆదేశించింది. అయితే రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై రుసుములకు అవకాశం కల్పించినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
వినియోగదారులపైనే భారం
యూపీఐ వినియోగదారులపై నేరుగా రుసుములు విధించబోమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. వ్యాపారులపై పడే రుసుముల భారం చివరకు వినియోగదారులపైనే పడుతుందని రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. వ్యాపారులు అదనపు రుసుముల భారాన్ని వస్తువులు, సేవల ధరల పెంపు ద్వారా వినియోగదారులపై మోపే అవకాశం ఉందని విమర్శించారు.
భారత్‌లో అమలవుతున్న సున్నా వ్యాపారి రాయితీ రుసుము విధానాన్ని అమెరికాకు చెందిన చెల్లింపు సంస్థలు చాలాకాలంగా వ్యతిరేకిస్తున్నాయని రాహుల్ గాంధీ తెలిపారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ విధానంలో మార్పులకు మార్గం సుగమం చేసిందని ఆరోపించారు.








