---Advertisement---

ఖమ్మంలో వెలుగుమట్ల భూ వివాదం వేడెక్కింది.. కవితతో పాటు 33 మందిపై కేసులు

March 10, 2026

Summarize with AI

---Advertisement---

ఖమ్మం (Khammam) నగరంలోని వెలుగుమట్ల (Velugumatla) భూ బాధితుల సమస్య మరోసారి రాజకీయంగా చర్చకు దారి తీసింది. భూదాన భూముల్లో (Bhoodan Lands) గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వారికి పట్టాలు (Land Pattas) ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జాగృతి అధినేత కవిత (Kavitha) పునరావాస కేంద్రంలో నిరాహార దీక్ష చేపట్టారు.

గత నెల 24న వెలుగుమట్ల వద్ద గుడిసెలను పోలీసులు తొలగించడంతో ఈ వివాదం ప్రారంభమైంది. బాధితులను పరామర్శించిన కవిత అంబేద్కర్ విగ్రహం వద్ద సుమారు నాలుగున్నర గంటల పాటు ధర్నా నిర్వహించగా పోలీసులు (Police) ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

తర్వాత మళ్లీ పునరావాస కేంద్రానికి వెళ్లి నిరాహార దీక్ష కొనసాగించడంతో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు మరోసారి కవితను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో కవితతో పాటు మరో 33 మందిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారనే ఆరోపణలతో కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment