విజయ్ సేతుపతి (Vijay Sethupathi) చేసిన తాజా వ్యాఖ్యలు తమిళనాడు (Tamil Nadu) రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. బిగ్‌బాస్ తమిళ్ 10 కార్యక్రమంలో (Bigg Boss Tamil 10) నాయకత్వ లక్షణాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
బిగ్‌బాస్ ఇంట్లో ఓ కంటెస్టెంట్ నాయకత్వ శైలిపై చర్చ జరుగుతున్న సమయంలో సేతుపతి కీలక వ్యాఖ్యలు చేశారు. నాయకుడు (Leader) హామీలు (Promises) ఇవ్వడమే కాకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి బాధ్యతలు స్వీకరించాలని, కష్టకాలంలో ప్రజలకు (People) అండగా నిలబడాలని అన్నారు. సమస్యలు(Problems) వచ్చినప్పుడు తప్పించుకోవడం నాయకత్వం కాదని, ప్రతిపక్షాన్ని నిందించడం మాత్రమే నాయకుడి లక్షణం కాదని వ్యాఖ్యానించారు.
అయితే సేతుపతి తన వ్యాఖ్యల్లో ఎక్కడా ఏ రాజకీయ నాయకుడి పేరు లేదా పార్టీ పేరును ప్రస్తావించలేదు. అయినప్పటికీ ప్రస్తుత తమిళనాడు రాజకీయ పరిణామాలతో ఆయన వ్యాఖ్యలను ముడిపెడుతూ సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా నటుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలోనే సేతుపతి ఈ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో విజయ్, విజయ్ సేతుపతి అభిమానుల మధ్య చర్చ మొదలైంది.
మరోవైపు కంటెస్టెంట్ నాయకత్వంపై (Contestant Leadership) జరిగిన సాధారణ చర్చలో భాగంగానే సేతుపతి ఈ వ్యాఖ్యలు చేశారని, ఎవరినీ ఉద్దేశించి ప్రత్యేకంగా మాట్లాడలేదని మరికొందరు అంటున్నారు. గతంలో విజయ్‌పై తన అభిమానాన్ని పలుమార్లు వ్యక్తం చేసిన సేతుపతి.. మాస్టర్ సినిమా సమయంలోనూ ఆయనను ప్రశంసించారు. దీంతో తాజా వ్యాఖ్యలను రాజకీయ వివాదంగా చూడకుండా సందర్భాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.








