తమిళనాడు రాజకీయాల్లో (Tamil Nadu Politics) పెద్ద మలుపు తిరగబోతోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్రవిడ పార్టీల డామినేషన్‌కు చెక్ పెడుతూ, దళపతి విజయ్(Vijay) నాయకత్వంలోని తమిళగ వెట్రి కజగం(TVK Party) అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైంది. కొత్త ముఖ్యమంత్రిగా(Chief Minister) విజయ్(Vijay) ప్రమాణస్వీకారం (Oath-Taking) మే 7న చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో (Jawaharlal Nehru Indoor Stadium) గ్రాండ్‌గా జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ వేడుక కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇటీవల విజయ్ తన పార్టీ కార్యాలయంలో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలతో(MLAs) సుదీర్ఘంగా సమావేశమయ్యారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ మీటింగ్‌లో ప్రభుత్వం ఏర్పాటు, మద్దతు వ్యవహారాలు, రాజకీయ వ్యూహాలపై కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత ఎలాంటి అనిశ్చితి రాకుండా ఉండేందుకు ఎమ్మెల్యేలను మహాబలిపురంలోని ఫోర్ పాయింట్స్ రిసార్ట్‌కు (Four Points Resort) తరలించడం హాట్ టాపిక్‌గా మారింది. ఇతర పార్టీలు ఎలాంటి ఆపరేషన్లు చేయకుండా ఉండేందుకే ఈ క్యాంప్ పాలిటిక్స్ స్టార్ట్ చేసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
టీవీకేకు ప్రస్తుతం 108 స్థానాలు ఉండగా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజిక్ ఫిగర్ చేరుకోవాలంటే ఇంకా కొంత మద్దతు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో చిన్న పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేలతో విజయ్ సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. తమకు తగిన సంఖ్యాబలం ఉందని చూపించేందుకు గవర్నర్‌ను (Governor) త్వరలో కలవనున్నట్లు సమాచారం. సభాపక్ష నాయకుడిగా ఎన్నికైన పత్రాన్ని సమర్పించి, ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
సినిమా రంగంలో స్టార్‌గా వెలుగొందిన విజయ్, ఇప్పుడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతుండటం దేశవ్యాప్తంగా ఆసక్తిని పెంచుతోంది. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తారనేది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. మే 7న జరగనున్న ఈ ప్రమాణస్వీకారం తమిళనాడు రాజకీయ దిశను పూర్తిగా మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






