---Advertisement---

తమిళనాడులో కొత్త శకం.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విజయ్.

May 10, 2026

---Advertisement---

తమిళనాడు రాజకీయాల్లో (Tamil Nadu Politics) ఊహించని మార్పులకు నాంది పలుకుతూ నటుడు, టీవీకే(TVK) అధినేత జోసఫ్ విజయ్ (Joseph Vijay) ముఖ్యమంత్రిగా (Chief Minister) ప్రమాణస్వీకారం (Swearing-In) చేశారు. అధికార బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజలకు నేరుగా మేలు చేసే పలు కీలక నిర్ణయాలపై తొలి సంతకాలు చేసి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు.

సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ (Free Electricity) అందించే ఫైలుపై తొలి సంతకం చేసిన విజయ్, మహిళల భద్రత కోసం షీటీమ్స్ (She Teams) తరహాలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని రెండో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల సమస్యను అరికట్టేందుకు ఈగల్ తరహా ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే నిర్ణయంపై కూడా సీఎం విజయ్ సంతకం చేయడం విశేషం.

ప్రమాణ స్వీకార కార్యక్రమంలో విజయ్ చేసిన భావోద్వేగ ప్రసంగం అభిమానులను, ప్రజలను ఆకట్టుకుంది. “నేను మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిని. మీ అన్నగా, తమ్ముడిగా ఉంటాను. నాకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను. మీ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయను” అంటూ ఆయన పేర్కొన్నారు.

అలాగే “అసాధ్యమైన హామీలు ఇవ్వను. సాధ్యమైనదే చేస్తాను. నా ప్రభుత్వంలో ఒకటే పవర్ సెంటర్ ఉంటుంది. ప్రజాధనాన్ని వృథా చేయను. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని ఆరోపిస్తూ త్వరలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తాను” అని విజయ్ ప్రకటించారు. యువత, విద్యార్థులు, మైనార్టీలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి జగన్ సోదరుడు (Jagan Brother) వైయస్ అనీల్ (YS Anil) హాజరుకావడం ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. తమిళనాడు రాజకీయ పరిణామాలు, విజయ్ రాజకీయ ఎదుగుదలతో పాటు ఈ హాజరు వెనుక రాజకీయ ప్రాధాన్యత ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment