---Advertisement---

విజయ్ వల్ల కడుపులో బిడ్డను కోల్పోయా.. బుల్లితెర నటి జూలీ సంచలన ఆరోపణలు

June 1, 2026

---Advertisement---

తమిళనాడు (Tamil Nadu) రాజకీయాలు, సినీ వర్గాల్లో మరోసారి సంచలన చర్చకు దారితీసేలా బుల్లితెర నటి జూలీ (Julie) చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. టీవీకే (TVK) అధినేత విజయ్‌పై (Vijay) ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తూ తన వ్యక్తిగత జీవితంలో జరిగిన విషాదానికి పరోక్షంగా ఆయనే కారణమని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

జల్లికట్టు ఉద్యమం (Jallikattu Movement) ద్వారా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న జూలీకి, విజయ్ రాజకీయ ప్రవేశం తర్వాత నుంచి విభేదాలు ఉన్నాయని తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఆమె విమర్శలు గుప్పించింది. అంతేకాకుండా చెన్నైలోని (Chennai) మెరీనా బీచ్ (Marina Beach) వద్ద అనుమతి లేకుండా విజయ్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టడంతో వివాదంలోనూ నిలిచింది.

ఈ ఘటనల అనంతరం విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు తనపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేశారని జూలీ ఆరోపించింది. సోషల్ మీడియా వేదికగా నిరంతరం వ్యక్తిగత దూషణలు, విమర్శలు ఎదుర్కొనాల్సి వచ్చిందని, దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని తెలిపింది.

ప్రస్తుతం తనపై రూ.15 లక్షల కిడ్నీ స్కామ్ ఆరోపణలు కూడా మోపుతూ ఏదో ఒక కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వేధింపులు, ట్రోలింగ్ కారణంగా మానసిక ప్రశాంతత పూర్తిగా కోల్పోయానని, అదే పరిస్థితి తన గర్భస్రావానికి దారితీసిందని పేర్కొంది.

ప్రత్యక్షంగా విజయ్ ప్రమేయం ఉందని తాను చెప్పడం లేదని, కానీ పరోక్షంగా అయినా ఈ పరిస్థితికి ఆయన బాధ్యత వహించాలని జూలీ వ్యాఖ్యానించింది. తనపై జరుగుతున్న ట్రోలింగ్‌ను అరికట్టేందుకు విజయ్ ఒక్క మాట చెప్పి ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా మారేదేమీ కాదని, తన కడుపులో ఉన్న బిడ్డను కోల్పోయేదాన్ని కాదని భావోద్వేగంతో వెల్లడించింది.

జూలీ చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీయగా, విజయ్ అభిమానులు మరియు టీవీకే కార్యకర్తల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment