ఆఫ్ఘనిస్తాన్‌తో (Afghanistan) జరగనున్న వన్డే సిరీస్‌కు ముందు భారత (India)జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) హ్యామ్‌స్ట్రింగ్ గాయం (Hamstring Injury) కారణంగా మొత్తం సిరీస్‌కు దూరమైనట్లు సమాచారం. జూన్ 13 నుంచి 20 వరకు భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య 3 వన్డేల సిరీస్ (ODIs Series) జరగనుండగా.. ఈ సిరీస్‌లో కోహ్లీ అందుబాటులో ఉండడంలేదు.
ఐపీఎల్ 2026 ఫైనల్లో బెంగళూరు(RCB) తరఫున ఆడిన సమయంలోనే కోహ్లీ ఈ గాయానికి గురైనట్లు తెలుస్తోంది. ఫైనల్లో 42 బంతుల్లో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచిన కోహ్లీ జట్టుకు వరుసగా రెండో టైటిల్ అందించాడు. అయితే మ్యాచ్ చివరి దశలో పరుగులు తీసే సమయంలో అతడు అసౌకర్యంగా కనిపించగా.. అప్పటికే హ్యామ్‌స్ట్రింగ్ సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం బయటకు వచ్చింది.
ఐపీఎల్ 2026 సీజన్‌లో కోహ్లీ అద్భుత ఫామ్‌లో కనిపించాడు. 16 మ్యాచ్‌ల్లో 675 పరుగులు చేసి మరోసారి తన క్లాస్‌ను నిరూపించాడు. ఇదే జోష్‌ను ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌లో కొనసాగించి 2027 వన్డే ప్రపంచకప్ జట్టులో తన స్థానాన్ని మరింత బలపర్చుకోవాలని భావించిన కోహ్లీకి గాయం పెద్ద షాక్‌గా మారింది.
భారత్-ఆఫ్ఘనిస్తాన్ (India-Afghanistan) సిరీస్‌ను 2027 ప్రపంచకప్ సన్నాహకాలకు కీలకంగా భావిస్తున్నారు. జూన్ 6 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో 1 టెస్ట్ మ్యాచ్‌తో పాటు 3 వన్డేలు జరగనున్నాయి. టెస్ట్, వన్డే జట్లకు శుభ్‌మన్ గిల్ (Shubman Gill) నాయకత్వం వహించనున్నాడు.
వన్డే ఫార్మాట్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma), కోహ్లీ మళ్లీ భారత జెర్సీలో కనిపించనున్నారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఇప్పుడు కోహ్లీ గాయంతో నిరాశ నెలకొంది. అతని స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందన్న చర్చ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ జూన్ 6న న్యూ చండీగఢ్‌లో జరిగే ఏకైక టెస్టుతో ప్రారంభమవుతుంది. అనంతరం జూన్ 13న ధర్మశాలలో తొలి వన్డే, జూన్ 17న లక్నోలో రెండో వన్డే, జూన్ 20న చెన్నైలో మూడో వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి.






