ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) కూటమి ప్రభుత్వం (Coalition Government) అమలు చేయాలని భావిస్తున్న ‘బీచ్ షాక్స్’(Beach Shacks) విధానానికి వ్యతిరేకంగా విశాఖలో (Visakhapatnam) నిరసనలు ఉధృతమయ్యాయి. సముద్ర తీర ప్రాంతాల్లో మద్యం విక్రయాలకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 362ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ (YSRCP) మహిళా విభాగం (Women’s Wing) ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్‌లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేలాది మంది మహిళలు స్వచ్ఛందంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా మహిళలు చేతుల్లో నల్ల బెలూన్లు, నల్ల రిబ్బన్లు ధరించి ప్రదర్శన నిర్వహించారు. బీచ్ రోడ్ (Beach Road) అంతటా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ అగ్రనేతలు పూర్తి మద్దతు ప్రకటించారు. ర్యాలీలో వరుదు కళ్యాణి, బొత్స ఝాన్సీ లక్ష్మి, గొల్ల బాబురావు, కేకే రాజు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొని మహిళలకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ(YSRCP) నాయకులు మాట్లాడుతూ, గోవా తరహా సంస్కృతిని ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టి పవిత్రమైన విశాఖ తీరాన్ని మద్యం కేంద్రంగా మార్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బీచ్‌లలో మద్యం విక్రయాలకు అనుమతిస్తే కుటుంబాలు, మహిళలు(Womens), విద్యార్థులు(Students) నిర్భయంగా బీచ్‌లకు వచ్చే పరిస్థితి ఉంటుందా అని ప్రశ్నించారు. పర్యాటక అభివృద్ధి పేరుతో మహిళల భద్రతను, ప్రజల శాంతిభద్రతలను పణంగా పెట్టడం తగదని విమర్శించారు.






