వరంగల్‌లో (Warangal) 800 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన శైవక్షేత్రం కూల్చివేత ఇప్పుడు తెలంగాణ (Telangana) రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ (Integrated School) నిర్మాణం పేరుతో ప్రభుత్వం చారిత్రక ఆలయాన్ని నేలమట్టం చేసిందంటూ హరీష్ రావు(T. Harish Rao) తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు.. ఈ కూల్చివేత వెనుక గుప్తనిధుల కోణం ఉందంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఆలయం కూల్చివేతపై హరీష్ రావు ఫైర్
సోమవారం వరంగల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు.. రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.“ఈ ప్రభుత్వానికి కట్టడం రాదు.. కూల్చడం (Demolition) మాత్రమే తెలుసు” అంటూ మండిపడ్డారు.పేదల ఇళ్లతో పాటు దేవాలయాలను (Temples) కూడా కూల్చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. నిజంగా అక్కడ స్కూల్ నిర్మాణమే లక్ష్యమైతే అర్థరాత్రి సమయంలో పనులు ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు.
గుప్తనిధుల కోసమే తవ్వకాలా?
ఆలయం కూల్చివేత వెనుక అసలు ఉద్దేశం గుప్తనిధులేనని హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు.పురాతన ఆలయాలను టార్గెట్ చేస్తూ గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయేమోనని అనుమానం వ్యక్తం చేశారు.కూల్చిన ఆలయ గర్భగుడి కింద సుమారు 24 అడుగుల లోతులో గొయ్యి తవ్వారని, అక్కడ ఏమైనా నిధులు లభించి ఉంటే వాటిని తరలించి ఉండొచ్చని ఆరోపించారు.ఈ తవ్వకాల విషయాన్ని పురావస్తు శాఖ అధికారులే గుర్తించారని పేర్కొన్నారు.
“విగ్రహం ఉన్న ప్రదేశానికే ఎందుకు తవ్వకాలు జరిపారు?” అంటూ ఆయన ప్రశ్నించారు.
ఆలయం కూల్చివేతపై పురావస్తు శాఖ (Archaeology Department) ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ (FIR) నమోదు కాలేదని హరీష్ రావు ఆరోపించారు.దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు.1958 పురావస్తు చట్టం ప్రకారం 100 ఏళ్లకు పైబడిన ఆలయాలు పురావస్తు శాఖ పరిధిలోకి వస్తాయని గుర్తు చేశారు.అలాంటి చారిత్రక కట్టడాన్ని రక్షించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు.
ప్రభుత్వానికి హరీష్ రావు డిమాండ్లు
ఈ ఘటనపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.ఆలయం కూల్చివేతకు బాధ్యులైన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు.అంతేకాదు..
- యుద్ధ ప్రాతిపదికన ఆలయ పునరుద్ధరణ చేపట్టాలి
- ఆలయాన్ని పురావస్తు శాఖకు అప్పగించాలి
- అర్థరాత్రి తవ్వకాలపై పూర్తి విచారణ జరపాలి
- గుప్తనిధులు బయటపడితే అవి ఎక్కడికి వెళ్లాయో వెల్లడించాలి
అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాకతీయుల వారసత్వంపై రాజకీయ రగడ
తమ పాలనలో కాకతీయుల గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేశామని హరీష్ రావు పేర్కొన్నారు.కానీ ప్రస్తుత ప్రభుత్వం అదే కాకతీయుల చారిత్రక వారసత్వాన్ని ధ్వంసం చేస్తోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు.ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారగా.. ఆలయం కూల్చివేత వెనుక నిజంగా గుప్తనిధుల కోణం ఉందా? అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది.






