క్రికెట్ (Cricket) అభిమానులకు భారీ శుభవార్త. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళల టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ఇంగ్లాండ్ (England) ఆతిథ్యం ఇస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళల క్రికెట్ జట్లు ఈ మెగా ఈవెంట్‌లో తలపడనున్నాయి.
ఈసారి మొత్తం 12 జట్లు వరల్డ్ కప్ బరిలోకి దిగుతున్నాయి. టోర్నీలో (Tournament) భాగంగా 33 మ్యాచ్‌లు జరగనున్నాయి. నేటి నుంచి ప్రారంభమవుతున్న ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఎడ్జ్ బాస్టన్ వేదికగా రాత్రి 11 గంటలకు ప్రారంభం కానుంది.
అటు భారత మహిళల జట్టు (Indian (Women’s Team) కూడా టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ నెల 14వ తేదీన భారత్ తన తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో (Pakistan) ఆడనుంది. ఇటీవల వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళల జట్టు.. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ కూడా కైవసం చేసుకుంటుందని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇక ఈ మెగా టోర్నీని జియో హాట్ స్టార్‌తో (Jio Hotstar) పాటు స్టార్ స్పోర్ట్స్ ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.






