వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో పొగాకు రైతులను (Tobacco Farmers) పరామర్శించి, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతులతో (Farmers) ముఖాముఖి నిర్వహించిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతుల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
జగన్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో (Chandrababu Government) రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలతో పాటు వ్యవసాయ రంగంలోనూ (Agriculture Sector) విధ్వంసకర పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు, అరెస్టులు జరుగుతున్నాయని అన్నారు. 27 నెలల కూటమి పాలనలో రైతులకు గిట్టుబాటు ధర (Remunerative Price) దక్కలేదని, అనేక మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
పొగాకు రైతుల పరిస్థితిని ప్రస్తావిస్తూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కిలో పొగాకు ధర రూ.289 వరకు ఉండేదని, ప్రస్తుతం అది రూ.236కు పడిపోయిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం కేవలం 21 శాతం మాత్రమే కొనుగోలు చేసిందని ఆరోపించారు. గిట్టుబాటు ధర లేక వెంకటేశ్వరరావు (Venkateswara Rao) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నప్పటికీ, ప్రభుత్వం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని విమర్శించారు.
అలాగే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో లక్ష రూపాయల వరకు సున్నా వడ్డీ రుణాలు (Zero Interest Loans) అందించామని, ప్రస్తుతం ఆ పథకాన్ని రద్దు చేశారని చెప్పారు. రైతు భరోసా (Rythu Bharosa) సాయంలోనూ కోతలు పెట్టారని ఆరోపించారు. దళారులతో ప్రభుత్వం రాజీ పడటంతో రైతులు నష్టపోతున్నారని, వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రైతులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా పొగాకు రైతులు కూడా తమ సమస్యలను జగన్కు వివరించారు. కూటమి ప్రభుత్వం (Alliance Government) అధికారంలోకి వచ్చిన తర్వాత గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోయామని తెలిపారు. ఎకరానికి సుమారు రూ.3 లక్షల పెట్టుబడి పెట్టినా లాభం రావడం లేదని, లోగ్రేడ్ పొగాకును (Low Grade Tobacco) కూడా కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రుణాలపై వడ్డీ భారం పెరిగిందని, ఈ పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యల దిశగా నెట్టబడుతున్నారని అన్నారు.
దేవరపల్లిలో జరిగిన జగన్ పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో జెన్జీ యువత(Gen Z Youth), విద్యార్థులు(Students), కార్యకర్తలు పాల్గొని ఘన స్వాగతం పలికారు. పర్యటన మార్గమంతా జెండాలు, ప్లకార్డులతో అభిమానులు సందడి చేశారు. పలుచోట్ల పూల వర్షం కురిపిస్తూ జగన్కు స్వాగతం పలికారు. గ్రామాలు, పట్టణాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో దేవరపల్లిలో సందడి నెలకొంది.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో యువత మద్దతు కీలకంగా మారుతున్న తరుణంలో జగన్ పర్యటనలో జెన్జీ యువత భారీగా పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన జగన్, తన పర్యటనకు హాజరైన ప్రజలు(Peoples), యువతకు(Youth) కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటనతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొన్నట్లు వైఎస్సార్సీపీ వర్గాలు పేర్కొన్నాయి.







