డీఎస్సీ నియామకాల (DSC Recruitments) వ్యవహారంపై మాజీ సీఎం, వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్ (YS Jagan) మరోసారి ప్రశ్నలు సంధించారు. డీఎస్సీకి(DSC) సంబంధించిన అంశాలపై రోజుకో ప్రశ్నను లేవనెత్తుతూ ఎక్స్ వేదికగా పోస్టులు చేస్తున్న ఆయన.. ప్రభుత్వం ఇస్తున్న వివరణలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు. ఓ అభ్యర్థి టెట్ మార్కులు(TET Marks), అర్హత(Eligibility), వెరిఫికేషన్ ప్రక్రియకు(Verification Process) సంబంధించి పలు కీలక ప్రశ్నలను జగన్ లేవనెత్తారు.
𝗢𝗻𝗲 𝗧𝗲𝗮𝗰𝗵𝗲𝗿 𝗣𝗼𝘀𝘁. 𝗔 𝗥𝗼𝗹𝗹𝗲𝗿𝗰𝗼𝗮𝘀𝘁𝗲𝗿 𝗼𝗳 𝗧𝘄𝗶𝘀𝘁𝘀 & 𝗧𝘂𝗿𝗻𝘀 𝗶𝗻 𝘁𝗵𝗶𝘀 𝗗𝗦𝗖 𝗦𝗰𝗮𝗺!@ncbn Garu, the explanations keep changing, and every new explanation gives rise to even more questions for teacher aspirants.
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 13, 2026
𝗟𝗲𝘁’𝘀 𝗳𝗼𝗹𝗹𝗼𝘄… pic.twitter.com/MP38UWEkxD
ట్విస్ట్ 1: 65 మార్కులు.. 7 దశల వెరిఫికేషన్
టెట్‌లో 65 మార్కులు సాధించిన ఓ అభ్యర్థికి టీచర్ ఉద్యోగం ఎలా లభించిందని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఉద్యోగ నియామకానికి ముందు ఆ అభ్యర్థి 7 దశల వెరిఫికేషన్‌ను పూర్తి చేసినట్లు చెబుతున్నారని, అలాంటప్పుడు అతని అర్హతపై అప్పుడే ఎందుకు స్పష్టత రాలేదని నిలదీశారు.
ట్విస్ట్ 2: డీఈవో అనర్హుడిగా ఎలా తేల్చారు?
అదే అభ్యర్థిని డీఈవో(DEO) అనర్హుడిగా ప్రకటించిన విషయాన్ని జగన్ ప్రస్తావించారు. 7 దశల వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత కూడా అభ్యర్థి అనర్హుడని ఎలా గుర్తించారని ప్రశ్నించారు. ఉద్యోగం (Job) ఎలా వచ్చిందో తనకే తెలియదని అభ్యర్థి చెప్పే పరిస్థితి ఉంటే.. 7 దశల్లో అధికారులు అసలు ఏం పరిశీలించారో ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు.
ట్విస్ట్ 3: ఉద్యోగం వచ్చింది.. కానీ ఎలా వచ్చిందో తెలియదా?
అభ్యర్థికి ఉద్యోగం లభించినప్పటికీ అది ఎలా వచ్చిందో తనకే తెలియదని చెప్పడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందని జగన్ పేర్కొన్నారు. నియామకానికి ముందు నిర్వహించిన 7 దశల వెరిఫికేషన్‌లో(7-Stage Verification) అర్హతలను సక్రమంగా పరిశీలించారా లేదా అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.
ట్విస్ట్ 4: సడన్‌గా తెరపైకి వచ్చిన 77 మార్కులు
2018లో నిర్వహించిన టెట్‌లో(TET) సదరు అభ్యర్థికి 77 మార్కులు వచ్చినట్లు అధికారులు ఇప్పుడు నిర్ధారించారని జగన్ పేర్కొన్నారు. ఆ 77 మార్కులు అప్పటికే అధికారిక రికార్డుల్లో ఉన్నట్లయితే.. నియామక ప్రక్రియలో వాటిని ముందుగానే ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు.
అలాగే 77 మార్కుల(Marks) విషయం తెలిసినప్పటికీ డీఈవో (DEO) ఆ అభ్యర్థిని అనర్హుడిగా ఎందుకు ప్రకటించారని జగన్ నిలదీశారు. తాను ప్రశ్నలు లేవనెత్తిన తర్వాతే 2018 టెట్‌లో 77 మార్కులు వచ్చినట్లు వివరణ ఎందుకు వెలుగులోకి వచ్చిందని ప్రశ్నించారు.
ట్విస్ట్ 5: రాంగ్ పేపర్ ట్విస్ట్
77 మార్కులు వచ్చినట్లు చెబుతున్నది టెట్ పేపర్ 2లో(TET Paper 2) అని అధికారులు పేర్కొంటున్నారని జగన్ తెలిపారు. అయితే ఎస్జీటీ పోస్టుకు (SGT Post) అవసరమైన టెట్ అర్హత పేపర్ 1ఏకు సంబంధించినదని పేర్కొన్నారు. అలాంటప్పుడు సంబంధిత అర్హతలను సరిగా పరిశీలించకుండానే ఆ అభ్యర్థి 7 దశల వెరిఫికేషన్‌ను ఎలా పూర్తి చేశారని ప్రశ్నించారు.
ట్విస్ట్ 6: ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్లీ టెట్
ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా అదే అభ్యర్థి 2025లో మరోసారి టెట్ పరీక్ష రాసిన విషయాన్ని జగన్ ప్రస్తావించారు. 2018లోనే 77 మార్కులు సాధించి అర్హత పొందినట్లయితే.. మళ్లీ 2025లో టెట్ పరీక్ష రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.
డీఎస్సీ నియామక ప్రక్రియలో పారదర్శకతపై వైఎస్ జగన్ తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. ఇదేనా నిష్పక్షపాతమైన, పారదర్శకమైన నియామక ప్రక్రియ అని ప్రశ్నించారు. ఇలాంటి పరిణామాలే డీఎస్సీ అక్రమాలకు అవకాశం కల్పించలేదా అని నిలదీశారు.
డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇప్పటికైనా నైతిక బాధ్యత వహిస్తారా లేదా అని మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రభుత్వం సమగ్ర వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.





