---Advertisement---

ఉండవల్లి ఘటనలో వైసీపీ నేతలు, రైతులపై వరుస కేసులు.

June 28, 2026

Summarize with AI

---Advertisement---

తాడేపల్లి మండలం ఉండవల్లి (Undavalli) ఘటన అనంతరం వైసీపీ నేతలు(YSRCP Leaders), రైతు పరిరక్షణ కమిటీ (Farm Protection Committee) సభ్యులపై పోలీసులు(Police) కేసులు నమోదు చేశారు. రాజధాని ప్రాంత పర్యటనకు వచ్చిన వైసీపీ నాయకులు, రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై ఎస్సీ, ఎస్టీ చట్టం (SC/ST Act) కింద ఒక కేసుతో పాటు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై మరో కేసు నమోదు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు (CI Veerendrababu) ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, డైమండ్ బాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి, పానుగంటి చైతన్య, పెనుమాక రైతు శివారెడ్డి, నూనె ఉమామహేశ్వర్ రెడ్డి, నవరత్నాల మూర్తితో పాటు మరికొందరిపై కేసులు(Cases) నమోదు చేశారు. అదేవిధంగా, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా మరికొందరిపై మరో కేసు నమోదు చేశారు.

మరోవైపు, నిన్న ఉండవల్లిలో జరిగిన ఘటనలో టీడీపీ(TDP) కార్యకర్తలు వైసీపీ(YSRCP) నేతలు, రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై రాళ్లతో దాడి చేశారని ఆరోపణలు వెలువడ్డాయి. ఈ దాడిలో ఒక కానిస్టేబుల్‌కు (Constable) గాయాలు కాగా, వైసీపీ నేతలు ప్రయాణిస్తున్న కార్లు ధ్వంసమైనట్లు సమాచారం. అయితే దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి, బాధితులుగా చెబుతున్న వైసీపీ నేతలు, రైతులపైనే(Farmers) కేసులు నమోదు చేయడం వివాదానికి దారితీసింది.

ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతుండగా, కేసుల నమోదుపై వైసీపీ నాయకులు, రైతు సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment