---Advertisement---

గిరిజన హక్కుల కోసం వైఎస్సార్సీపీ పోరాటం.. అమిత్ షాకు వినతి

August 6, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) గిరిజన హక్కుల (Tribal Rights) పరిరక్షణ కోసం ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. పాడేరులో నిర్వహించిన భారీ ‘మన్యం గర్జన'(Manyam Garjana) అనంతరం అరకు ఎంపీ డా. గుమ్మ తనూజరాణి(Gumma Tanuja Rani) నేతృత్వంలో వైఎస్సార్సీపీ (YSRCP)ఎంపీలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను(Amit Shah) కలిసి గిరిజన హక్కుల పరిరక్షణకు చట్టబద్ధ చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు.

జీవో నెం.3 స్థానంలో గిరిజనుల విద్య(Tribal People Education), ఉద్యోగ హక్కులకు (Employment Rights) భంగం కలగకుండా ప్రత్యామ్నాయ చట్టబద్ధ వ్యవస్థను తీసుకురావాలని, అలాగే 1/70 చట్టాన్ని బలోపేతం చేసేలా చర్యలు చేపట్టాలని వారు కోరారు. గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను కేంద్రం సమగ్రంగా పరిశీలించి రాజ్యాంగబద్ధ హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

1986లో ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు ఉపాధ్యాయ పోస్టుల్లో రిజర్వేషన్ కల్పించిన విధానం, అనంతరం జీవో-3 అమలు, సుప్రీంకోర్టు దానిని రద్దు చేసిన పరిణామాలను ఎంపీ తనూజరాణి కేంద్రం (Central Government) దృష్టికి తీసుకెళ్లారు.

ఇక 1/70 చట్టంపై సవరణల వ్యాఖ్యలు, సుప్రీంకోర్టులో(Supreme Court) పెండింగ్‌లో ఉన్న పిటిషన్ల నేపథ్యంలో గిరిజన భూముల రక్షణపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని తెలిపారు. ఎన్నికల సమయంలో జీవో-3 పునరుద్ధరణపై ఇచ్చిన హామీ అమలు కాకపోవడంపై గిరిజన సంఘాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment