---Advertisement---

జగన్ కీలక నిర్ణయం.. ప్రమాదవశాత్తు మృతి చెందిన పార్టీ నేతల కుటుంబాలకు 5 లక్షలు

September 30, 2026

Summarize with AI

---Advertisement---

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) కోసం నిబద్ధతతో పనిచేస్తున్న నాయకుల కుటుంబాలకు అండగా నిలిచే దిశగా పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ వివిధ పార్టీ కమిటీల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులు ప్రమాదవశాత్తు మృతి చెందిన సందర్భాల్లో వారి కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయం (Financial Assistance) అందించాలని నిర్ణయించారు. పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు (Workers Families) ఆపద సమయంలో అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.

ఈ ఆర్థిక సహాయం పొందేందుకు కొన్ని నిబంధనలను పార్టీ నిర్దేశించింది. మృతి చెందిన వ్యక్తి పార్టీ కమిటీలో నియమితుడై ఉండటంతో పాటు పార్టీ ఐడీ కార్డు (Party ID Card) పొంది ఉండటం తప్పనిసరి. ప్రమాదవశాత్తు (Accidentally) మృతిచెందినట్లు నిర్ధారించే FIR కాపీ, పోస్ట్‌మార్టం రిపోర్ట్ లేదా పంచనామా వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

అదేవిధంగా సంబంధిత గ్రామ లేదా వార్డు పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షుల సిఫార్సుతో మృతునికి సంబంధించిన పూర్తి వివరాలను ఎమ్మెల్యే లేదా అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. మృతుని కుటుంబం సూచించిన నామినీ బ్యాంక్ ఖాతా వివరాలతో పాటు ఆధార్ కార్డును కూడా తప్పనిసరిగా జత చేయాలని పార్టీ సూచించింది.

తమ పరిధిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన పార్టీ నాయకుల వివరాలను సంబంధిత ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు త్వరితగతిన పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించాలని కోరింది. పూర్తి వివరాలను నిర్దేశిత ఫార్మాట్‌లో సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది.

2026 అక్టోబర్ 1 తర్వాత ప్రమాదవశాత్తు మృతి చెందిన నాయకుల కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయ కార్యక్రమం వర్తించనుంది. పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తల కుటుంబ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, అవసరమైన సమయంలో వారికి సంస్థాగతంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైఎస్సార్‌సీపీ తెలిపింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment