---Advertisement---

మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్..నామినేషన్ తిరస్కరణతో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం

June 11, 2026

---Advertisement---

తెలంగాణ (Telangana) కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ (Congress In-charge) మీనాక్షి నటరాజన్‌కు (Meenakshi Natarajan) ఊహించని షాక్ తగిలింది. ఎంతో ఆశలు పెట్టుకున్న రాజ్యసభ సీటు చేజారిపోవడంతో కాంగ్రెస్ శిబిరంలో తీవ్ర నిరాశ నెలకొంది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు (Rajya Sabha) పోటీ చేసిన ఆమె నామినేషన్ (Nomination) అనూహ్య పరిణామాల మధ్య తిరస్కరణకు గురికావడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. చివరకు 3 మంది బీజేపీ(BJP) అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి (Returning Officer) ప్రకటించడంతో కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ తగిలింది.

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) నుంచి రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే హైదరాబాద్‌లో నమోదైన ఒక కేసు వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించలేదనే కారణంతో రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. ఈ నిర్ణయం కాంగ్రెస్ నేతలను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది.

తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని మీనాక్షి నటరాజన్ స్పష్టం చేసినప్పటికీ అధికారులు ఆమె వివరణను పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ వెంటనే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కానీ ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో విషయం మరింత ఉద్రిక్తంగా మారింది.

ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగనుంది. మరోవైపు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్రపతిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరుతూ నిరసనకు సిద్ధమయ్యారు.

అయితే ఈ వ్యవహారం కోర్టులో ఉండగానే 3 మంది బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించడం కాంగ్రెస్ నేతలను అవాక్కయ్యేలా చేసింది. దీంతో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment