తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. అధికార టీవీకే ప్రభుత్వం (TVK Government), ప్రతిపక్ష డీఎంకే(DMK) మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో (Assembly) ముఖ్యమంత్రి విజయ్(CM Vijay) చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందించిన డీఎంకే నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అసెంబ్లీలో గవర్నర్ (Governor) ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ ప్రతిపక్ష డీఎంకేపై తీవ్ర విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం ప్రజల డబ్బును దుర్వినియోగం చేయదని, అవినీతికి (Corruption) ఎలాంటి అవకాశం ఇవ్వదని స్పష్టం చేశారు. రైతుల(Farmers) సమస్యల పేరుతో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని కూడా ఆయన ఆరోపించారు.
విజయ్ వ్యాఖ్యలకు స్పందించిన ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేశారు. రైతుల ఆందోళనలను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని చెప్పడం రైతులను అవమానించడమేనని విమర్శించారు. అనంతరం వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ చెంగల్పట్టు కోర్టులో “భర్త (Wife) కోసం భార్య వెతుకుతున్న కథ” అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా విజయ్, ఆయన భార్య (Wife) సంగీత (Sangeetha) మధ్య కొనసాగుతున్న విడాకుల వ్యవహారాన్ని ఉదయనిధి ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ కేసు చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానంలో విచారణలో ఉంది. ఈ కేసులో తదుపరి విచారణ ఆగస్టు 7న జరగనుంది.
ఇదిలా ఉండగా, ఇటీవల అసెంబ్లీలో విజయ్ మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ (M.K. Stalin) హావభావాలను అనుకరిస్తూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కూడా ఉదయనిధి స్పందిస్తూ అసెంబ్లీని థియేటర్‌గా మార్చేశారని విమర్శించారు.
యాక్టింగ్ చేయడం మానేసి పాలనపై దృష్టి పెట్టాలని విజయ్‌కు సూచించిన ఉదయనిధి, టీవీకే అసెంబ్లీని షూటింగ్ స్పాట్‌గా మార్చిందని ఎద్దేవా చేశారు. స్పీకర్ (Speaker) “యాక్షన్”(Action) అంటే ముఖ్యమంత్రి నటించడం ప్రారంభిస్తున్నట్లుగా ఉందని, ఇక ముందు మేకప్ ఆర్టిస్టులు(Make-up Artists), స్టంట్ మాస్టర్లు (Stunt Masters) కూడా అసెంబ్లీకి వస్తారేమో అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు కొత్త వివాదానికి తెరలేపగా, అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కింది. ఈ వ్యాఖ్యలపై టీవీకే ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








