---Advertisement---

Donald Trump: 1000 క్షిపణులు సిద్ధం.. ఇరాన్‌కు ట్రంప్ సంచలన అల్టిమేటం!

July 11, 2026

Summarize with AI

---Advertisement---

అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్‌పై(Iran) మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకవైపు శాంతి చర్చలపై (Peace Talks) మాట్లాడుతూనే మరోవైపు ఇరాన్‌పై అమెరికా దాడులు (Attacks) కొనసాగుతున్న వేళ, ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సంచలనంగా మారాయి. తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’(Truth Social)లో చేసిన పోస్ట్ ద్వారా ఇరాన్‌కు ఆయన అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు.

తనను హతమార్చేందుకు ఇరాన్ ప్రభుత్వం (Iran Government) కుట్రలు పన్నుతోందన్న వార్తల నేపథ్యంలో స్పందించిన ట్రంప్, అలాంటి ప్రయత్నం జరిగితే ఇరాన్‌కు తీవ్రమైన పరిణామాలు తప్పవని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడిపై దాడి చేయాలనే ఆలోచనే ఇరాన్‌కు సర్వనాశనానికి దారితీస్తుందని హెచ్చరించారు.

ఇరాన్ అలాంటి చర్యకు పాల్పడితే 1000 క్షిపణులు (Missiles) ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ (Trump) వెల్లడించారు. అవి మాత్రమే కాకుండా వాటి వెంట మరో వేలాది క్షిపణులు దాడికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సైనిక ఉత్తర్వులు ఇప్పటికే జారీ అయ్యాయని, అవసరమైతే వెంటనే అమలు చేయడానికి అమెరికా సైన్యం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందని తెలిపారు.

1 సంవత్సరం కాల వ్యవధిలో ఇరాన్‌లోని(Iran) అన్ని కీలక ప్రాంతాలను పూర్తిగా ధ్వంసం చేసే సామర్థ్యం అమెరికా సైన్యానికి ఉందని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు వెలువడిన తర్వాత అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment