మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)(UCC) అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో యూసీసీ బిల్లును(UCC Bill) ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ (CM Mohan Yadav) ప్రకటించారు. అయితే కట్ని జిల్లాలో జరిగిన ఓ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ చర్చకు దారితీశాయి.
“రాష్ట్రంలో ఒక్క పెళ్లి (Marriage) చేసుకున్న వ్యక్తికే చట్టబద్ధంగా నివసించే హక్కు ఉంటుంది” అని సీఎం మోహన్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఒకే దేశం(One Nation), ఒకే రాజ్యాంగం (One Constitution), ఒకే జెండా (One Flag) ఉన్నప్పుడు వేర్వేరు వర్గాలకు వేర్వేరు వ్యక్తిగత చట్టాలు ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. అందరికీ సమానమైన చట్టం అమలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
రాముడు ఒక్క వివాహం చేసుకున్నప్పుడు మరికొందరికి 2, 3, 4 వివాహాలకు ఎందుకు అనుమతి ఉండాలని ప్రశ్నించిన ఆయన, ముస్లిం మహిళలు (Muslim Women) కూడా మన సోదరీమణులేనని పేర్కొన్నారు. ప్రతిపాదిత యూసీసీ చట్టం అమల్లోకి వస్తే ఒక్క వివాహం చేసుకున్న వ్యక్తికే మధ్యప్రదేశ్‌లో చట్టపరమైన హక్కులు ఉంటాయని తెలిపారు.
తక్షణ త్రిబుల్ తలాక్‌కు (Instant Triple Talaq) ప్రస్తుతం ఎలాంటి చట్టబద్ధత లేదని సీఎం గుర్తు చేశారు. ఎవరైనా “తలాక్” (Talaq) అనే పదాన్ని 3 సార్లు ఉచ్చరించి విడాకులు ఇవ్వాలని ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, జైలుశిక్ష కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. భోపాల్‌లోని జగదీష్పూర్లో(Jagdishpur) జరగనున్న తదుపరి కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపి, అనంతరం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెడతామని వెల్లడించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ హిందూ(Hindu), ముస్లిం (Muslim) పేరుతో సమాజాన్ని విభజించిందని ఆరోపించారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ (Congress Party) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎం తన వ్యాఖ్యల్లో “రామ్”(Ram), “రహీమ్”(Rahim) వంటి పవిత్రమైన పేర్లను ఉపయోగించడాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అబ్బాస్ హఫీజ్ (Abbas Hafeez) ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుళ్ల పేర్లను ఉపయోగించడం ముఖ్యమంత్రి ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందని విమర్శించారు.
యూసీసీ గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేవలం వివాహాల అంశాన్నే ప్రస్తావిస్తున్నారని హఫీజ్ అన్నారు. భారత రాజ్యాంగం కొన్ని గిరిజన తెగలకు బహుభార్యత్వానికి అనుమతి ఇచ్చిందనే విషయాన్ని ఆయన మర్చిపోతున్నారా అని ప్రశ్నించారు. గిరిజనుల రాజ్యాంగబద్ధ హక్కులను కూడా హరించాలని చూస్తున్నారా అంటూ నిలదీశారు. యూసీసీ పేరుతో బీజేపీ ఒకే వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.








