---Advertisement---

ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్.. పార్లమెంట్ ముట్టడితో ఉద్రిక్తత!

July 20, 2026

Summarize with AI

---Advertisement---

వేలాది మంది యువతతో కలిసి పార్లమెంట్ (Parliament) ముట్టడికి బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)(CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను (Abhijeet Deepke) ఢిల్లీ పోలీసులు (Delhi Police) అరెస్ట్ చేశారు. జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద చేపట్టిన నిరాహార దీక్షను విరమించిన అనంతరం ‘చలో సంసద్’(Chalo Sansad) ర్యాలీగా పార్లమెంట్ వైపు కదిలిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో దేశ రాజధానిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు నిరసనకారులను ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భారీ సంఖ్యలో తరలివచ్చిన యువతను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ (Lathi Charge) నిర్వహించడంతో పాటు టియర్ గ్యాస్ (Tear Gas) ప్రయోగించారు. పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు గాయపడినట్లు సమాచారం. దీంతో ఢిల్లీ నగరంలోని కీలక ప్రాంతాలు ఉద్రిక్త వాతావరణాన్ని తలపించాయి.

సీజేపీ ర్యాలీ ప్రభావం పార్లమెంట్‌లోనూ కనిపించింది. విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) రాజ్యసభలో (Rajya Sabha) తీవ్రంగా ఖండించారు. ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో లోక్‌సభ(Lok Sabha), రాజ్యసభలను (Rajya Sabha) రేపటికి వాయిదా వేశారు.

పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు ప్రారంభించింది. నిరసనకారుల ప్రధాన డిమాండ్లపై చర్చించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) నేతృత్వంలో 2 మంది కేంద్ర మంత్రులు పార్లమెంట్‌లో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇదే సమయంలో ప్రభుత్వ తరఫున బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో (JP Nadda) చర్చలు జరిపేందుకు సీజేపీ ప్రతినిధుల బృందం వెళ్లింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఢిల్లీ వ్యాప్తంగా భారీగా పారామిలటరీ బలగాలను మోహరించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment