న్యూఢిల్లీలో విద్యార్థులు (New Delhi Students), యువత నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంపై చేపడుతున్న నిరసన పోరాటాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)స్పందించింది. యువత భవిష్యత్తుకు సంబంధించిన ఏ అంశంపైనైనా తాము అండగా ఉంటామని పార్టీ స్పష్టం చేసింది. పార్టీ విడుదల చేసిన ప్రకటనలో “ప్రజాస్వామ్యం (Democracy) కేవలం నిలబెట్టబడటమే కాదు, అది నిలబెట్టబడుతున్నదనే నమ్మకం ప్రజల్లో కనిపించాలి.” అని తెలిపింది.
న్యూఢిల్లీలో విద్యార్థులు, యువత చేపడుతున్న నిరసనలను ప్రభుత్వాలు బాధ్యతతో, సున్నితంగా చూడాలని. వారి నిజమైన ఆందోళనలను వినాలని, వాటికి అర్థవంతమైన పరిష్కారాలు కనుగొనే దిశగా పనిచేయాలని. శాంతియుతంగా నిరసన తెలపడం ప్రతి పౌరుడికి ఉన్న ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కు అని. అదే సమయంలో, నిరసనలు శాంతియుతంగా కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని పెర్కోంది.
నీట్ పేపర్ లీక్ (NEET Paper Leak) ఘటన దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో పరీక్షా వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని. అందువల్ల పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రత, జవాబుదారీతనం పెంచే సమగ్ర సంస్కరణలు అత్యవసరం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కూడా డీఎస్సీ(DSC) పరీక్షలలో లీకులు, అక్రమాలు, అవకతవకలకు సంబంధించిన ఆధారాలు వెలుగులోకి వచ్చాయని పార్టీ పేర్కొంది. ఈ అంశాన్ని రాజకీయ వివాదంగా కాకుండా, స్వతంత్ర సంస్థ ద్వారా నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేసింది.
“నీట్ (NEET) అయినా, డీఎస్సీ (DSC) అయినా — విద్యార్థుల భవిష్యత్తు విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదు. నిజాలను వెలికితీయడం, వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం ప్రతి ప్రజాస్వామ్య ప్రభుత్వ బాధ్యత” అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.






