హైదరాబాద్లోని (Hyderabad) ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీల (Private Intermediate Colleges) వ్యవహారం సంచలనంగా మారింది. హైడ్రా కమిషనర్ (HYDRAA Commissioner) రంగనాథ్ (Ranganath) సంతకాన్ని ఫోర్జరీ (Signature Forgery) చేసి నకిలీ ఫైర్ ఎన్ఓసీలు సృష్టించిన 8 ప్రైవేట్ ఇంటర్ కాలేజీలపై (8 Intermediate Colleges) పోలీసులు కేసులు నమోదు చేశారు. విద్యార్థుల భద్రతతో (Students Safety) నేరుగా సంబంధం ఉన్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఇంటర్మీడియట్ కాలేజీలకు ఫైర్ ఎన్ఓసీలు (Fire NOCs) జారీ చేసే బాధ్యత హైడ్రా వద్ద ఉంటుంది. అయితే హైడ్రా నుంచి ఎలాంటి అనుమతులు జారీ కాకపోయినా, 8 కాలేజీ యాజమాన్యాలు కమిషనర్ సంతకాన్ని నకిలీగా (Signature Forgery) సృష్టించి ఫేక్ ఎన్ఓసీలను తయారు చేశాయి. ఆ నకిలీ ధ్రువపత్రాలను ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించి కాలేజీల అనుమతులు పొందేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు.
ఇంటర్మీడియట్ బోర్డుకు వివిధ కాలేజీల నుంచి మొత్తం 76 ఫైర్ ఎన్ఓసీలు అందగా, వాటిని హైడ్రా అధికారులు పరిశీలించారు. పరిశీలనలో 8 కాలేజీలు సమర్పించిన ఎన్ఓసీలు పూర్తిగా నకిలీవని తేలింది. దీంతో ఈ భారీ ఫోర్జరీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై హైడ్రా అదనపు డైరెక్టర్ లేక్ పోలీస్ స్టేషన్లో అధికారిక ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు 8 ప్రైవేట్ ఇంటర్ కాలేజీలపై కేసులు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఫోర్జరీకి పాల్పడిన కాలేజీల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని హైడ్రా అధికారులు ఇంటర్మీడియట్ బోర్డును కూడా కోరారు.






