---Advertisement---

22-ఏ భూముల వివాదం..రాహుల్ గాంధీకి ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ!

August 26, 2026

Summarize with AI

---Advertisement---

తెలంగాణలో(Telangana) సెక్షన్ 22-ఏ భూముల (Section 22-A Lands) సమస్యపై కాంగ్రెస్ (Congress) అగ్ర నాయకత్వం వెంటనే స్పందించాలని తెలంగాణ బీజేపీ (Telangana BJP) శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Aleti Maheshwar Reddy) డిమాండ్ చేశారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని(Ponguleti Srinivas Reddy) కేబినెట్ నుంచి తొలగించాలని కోరుతూ ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి(Rahul Gandhi) బహిరంగ లేఖ రాశారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవస్థీకృత భూ దోపిడీకి(Organized Land Grab) పాల్పడుతోందని ఏలేటి ఆరోపించారు. ధరణి డిజిటలైజేషన్ (Dharani Digitization) ఆడిట్ నివేదికను విడుదల చేయాలని, 2014 నుంచి సెక్షన్ 22-ఏ కింద సర్వే నంబర్ల వారీగా జరిగిన చేర్పులు, తొలగింపులు, మార్పుల వివరాలతో శ్వేతపత్రం (White Paper) విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భూ వ్యవహారాల్లోని ఆర్థిక లావాదేవీలు, క్విడ్ ప్రో కో(Quid Pro Quo) ఆరోపణలపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో(Sitting High Court Judge) విచారణ జరిపించాలని కోరారు.

రాహుల్ గాంధీ మాటలకు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు పొంతన లేదని ఏలేటి విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్.. తెలంగాణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సెక్షన్ 22-ఏను అడ్డుపెట్టుకుని నిజమైన పట్టాదారులు, చిన్న, సన్నకారు రైతులు(Farmers), మధ్యతరగతి కుటుంబాల (Middle-Class Families) భూ హక్కులను దెబ్బతీస్తున్నారని అన్నారు.

చట్టబద్ధమైన భూములను సైతం ముందస్తు సమాచారం లేకుండా నిషేధిత జాబితాలో చేర్చడంతో భూ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణి(Dharani), టీఎల్‌ఆర్‌యూపీ(TLRUP) ద్వారా ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాలను కొనసాగిస్తోందని విమర్శించారు.

భూ భారతి ఇన్వెంటరీ ఆడిట్‌లో వ్యవసాయ, అసైన్డ్(Assigned), కన్వర్టెడ్ భూములతో(Converted Lands) పాటు నిషేధిత జాబితాలోని ప్రైవేట్ భూముల విస్తీర్ణం భారీగా ఉన్నట్లు తేలిందని ఏలేటి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిషేధిత భూముల విస్తీర్ణం 1.00 కోట్ల నుంచి 1.05 కోట్ల ఎకరాలకు చేరిందని ఆరోపించారు.

ఈ వ్యవహారం పరిపాలనా లోపం కాదని, పథకం ప్రకారం సాగుతున్న భూ దందా అని ఆయన ఆరోపించారు. రెవెన్యూ మంత్రి కుటుంబానికి సంబంధించిన సంస్థలు, రాఘవ కన్స్ట్రక్షన్స్‌తో(Raghava Constructions) సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వేల కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలపై ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.

సెక్షన్ 22-ఏ కింద భూములను నిషేధిత జాబితాలో చేర్చి, అనంతరం డీ-నోటిఫికేషన్ల పేరుతో భారీ వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో నెలకు వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని, అందులో నుంచి నెలకు రూ.200 కోట్ల వరకు కాంగ్రెస్ అధిష్ఠానానికి నిధులు చేరుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలిపారు.

ఆగస్టు 20, 2026న అసెంబ్లీ ప్రాంగణంలో షెల్ కంపెనీలు, అక్రమ భూ లావాదేవీల పత్రాలతో బహిరంగ చర్చకు రావాలని పొంగులేటి శ్రీనివాస రెడ్డికి సవాల్ విసిరినట్లు ఏలేటి తెలిపారు. అయితే మంత్రి ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారని విమర్శించారు.

సొంత పార్టీ మంత్రులు తప్పు చేస్తే వారిని జవాబుదారీగా నిలబెట్టడమే నిజమైన నాయకత్వమని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో సెక్షన్ 22-ఏ భూముల వ్యవహారంపై కాంగ్రెస్ అగ్ర నాయకత్వం సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment