---Advertisement---

టీమిండియాలోకి సూర్యకుమార్ యాదవ్ రీఎంట్రీ.. బీసీసీఐ ఏం చెప్పిందంటే?

August 26, 2026

Summarize with AI

---Advertisement---

సూర్యకుమార్ యాదవ్ మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాడా? అనే చర్చ మరోసారి జోరందుకుంది. కొలంబోలో జరిగిన ఓ కార్యక్రమంలో శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్యను కలిసిన సూర్య.. ఆయన ఫిట్‌నెస్‌పై సరదాగా చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

జయసూర్యను ఉద్దేశించి సూర్యకుమార్.. “ఫిట్‌గా అవుతున్నారు.. మళ్లీ కమ్‌బ్యాక్‌కు ట్రై చేస్తున్నారా?” అంటూ సరదాగా అడిగాడు. దీనికి జయసూర్య నవ్వుతూ స్పందించాడు. వీరిద్దరి సంభాషణ అభిమానులను ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే సూర్యకుమార్ రీఎంట్రీపై బీసీసీఐ వర్గాల నుంచి కీలక సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. టీమిండియా తలుపులు సూర్యకు పూర్తిగా మూసుకుపోలేదని, దేశవాళీ క్రికెట్‌లో వరుసగా పరుగులు సాధిస్తే మళ్లీ జాతీయ జట్టులోకి ఎంపిక చేసే అవకాశం ఉందని ఓ బీసీసీఐ అధికారి తెలిపినట్లు సమాచారం.

2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్యకుమార్.. జట్టును టైటిల్ విజేతగా నిలిపాడు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో టీ20 కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కూడా కోల్పోయాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు.

మరోవైపు సూర్యకుమార్ తన కమ్‌బ్యాక్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. జూలైలో ఒకరోజు సుమారు 3 గంటల పాటు బ్యాటింగ్ సాధన చేసి దాదాపు 1,000 బంతులు ఆడినట్లు వెల్లడించాడు.

ప్రస్తుతం జాతీయ జట్టు ప్రణాళికల్లో లేకపోయినా.. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తే సూర్యకుమార్‌కు టీమిండియాలోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. దీంతో రాబోయే దేశవాళీ సీజన్ అతడి కెరీర్‌కు కీలకంగా మారనుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment