---Advertisement---

బస్సుల రంగులపై వివాదం.. విజయ్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు!

September 16, 2026

Summarize with AI

---Advertisement---

తమిళనాడులో(Tamil Nadu) విజయ్ ప్రభుత్వం (Vijay Government) మరోసారి రాజకీయ విమర్శలను ఎదుర్కొంటోంది. సేలంలో 25 కొత్త ప్రభుత్వ పట్టణ బస్సులను (New Government City Buses) పసుపు(Yellow), ఎరుపు(Red) రంగుల్లో సిద్ధం చేయడం వివాదానికి కారణమైంది. ఈ రంగులు టీవీకే పార్టీ జెండాను (TVK) Party Flag) పోలి ఉండటంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

సేలంలోని జాన్సన్‌పేట్ ప్రాంతం (Johnsonpet Area) నుంచి ఈ 25 కొత్త బస్సులను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వ బస్సులకు టీవీకే పార్టీ జెండాను పోలిన రంగులను ఉపయోగించడంపై సామాజిక మాధ్యమాల్లో కూడా చర్చ జరుగుతోంది.

ప్రభుత్వ ప్రజా ఆస్తులకు అధికార పార్టీకి సంబంధించిన రంగులను ఉపయోగించడంపై ప్రతిపక్షాలు (Opposition Parties) అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తమిళనాడులో ఇప్పటివరకు లేని కొత్త రాజకీయ సంప్రదాయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ డీఎంకే (DMK) విమర్శలు చేస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ బస్సులకు పసుపు, ఎరుపు రంగులను ఎవరి ఆదేశాల మేరకు ఎంపిక చేశారనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమా, లేక స్థానిక స్థాయిలో అధికారులు తీసుకున్న నిర్ణయమా అనే దానిపై కూడా చర్చ కొనసాగుతోంది.

ఈ వ్యవహారంపై తమిళనాడు రవాణాశాఖ నుంచి అధికారిక వివరణ రావాల్సి ఉంది. ప్రభుత్వ బస్సుల రంగుల ఎంపికపై వివాదం నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment