---Advertisement---

ప్రముఖ యూట్యూబర్ అగ్గిపెట్టె మచ్చా అలియాస్ కిరణ్ కుమార్ మృతి!

October 7, 2026

Summarize with AI

---Advertisement---

ప్రముఖ కమెడియన్, యూట్యూబర్ (YouTuber) ‘అగ్గిపెట్టి మచ్చ’(Aggipetti Machha) అలియాస్ కిరణ్ కుమార్ (Kiran Kumar) కన్నుమూశారు. గత నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని(Tirupati) సిమ్స్ ఆసుపత్రిలో(SIMS Hospital) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

కిరణ్ కుమార్ (Kiran Kumar) తనదైన కామెడీ శైలి, వినోదాత్మక వీడియోలతో యూట్యూబ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘అగ్గిపెట్టి మచ్చ’ పేరుతో సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన రూపొందించిన కామెడీ వీడియోలు, వినోద కార్యక్రమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

కిరణ్ కుమార్ మృతితో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల్లో విషాదం నెలకొంది. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు యూట్యూబర్లు, కళాకారులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment