---Advertisement---

వరి వంగడాల రక్షకుడు, పద్మశ్రీ చెరువయల్ రామన్ కన్నుమూత!

October 15, 2026

Summarize with AI

---Advertisement---

ప్రకృతి వ్యవసాయానికి జీవితాన్ని అంకితం చేసి, అంతరించిపోతున్న స్వదేశీ వరి వంగడాలను కాపాడిన పద్మశ్రీ (Padma Shri) పురస్కార గ్రహీత చెరువయల్ రామన్ (Cheruvayal Raman) (74) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో (Illness) బాధపడుతున్న ఆయన కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో (Kozhikode Medical College Hospital) చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కేరళలోని వయనాడ్ జిల్లా మానంతవాడికి చెందిన రామన్ మరణంతో వ్యవసాయ రంగంలో విషాదం నెలకొంది.

కురిచ్య గిరిజన తెగకు (Kurichya Tribal Community) చెందిన చెరువయల్ రామన్ చిన్నతనం నుంచే వ్యవసాయంపై (Farming) ఆసక్తి పెంచుకున్నారు. ప్రాథమిక విద్య తర్వాత 10 ఏళ్ల వయసులోనే సాగు ప్రారంభించారు. 1969లో ప్రభుత్వ ఉద్యోగం లభించినా దాన్ని వదులుకుని సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేశారు.

రసాయన ఎరువులు, పురుగుమందులు లేకుండా ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో సాగు చేస్తూ 45కు పైగా అరుదైన సంప్రదాయ వరి వంగడాలను సంరక్షించారు. ఔషధ మొక్కలు, అరుదైన చెట్లను కూడా పెంచారు. వెదురు బుట్టలు, గడ్డితో తయారు చేసిన సంప్రదాయ పాత్రల్లో విత్తనాలను భద్రపరిచి, వాటిని భావితరాలకు అందించేందుకు కృషి చేశారు.

రైతులకు (Farmers) ఉచితంగా విత్తనాలు అందించడం రామన్ ప్రత్యేకత. పంట చేతికి వచ్చిన తర్వాత తీసుకున్న పరిమాణానికి సమానంగా విత్తనాలను తిరిగి ఇచ్చే విధానాన్ని అనుసరించేవారు. దీంతో అరుదైన సంప్రదాయ వంగడాలు మరింత మంది రైతులకు చేరడంతో పాటు వాటి పరిరక్షణకు దోహదపడింది.

సంప్రదాయ విత్తనాల పరిరక్షణ, ప్రకృతి వ్యవసాయానికి చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2023లో చెరువయల్ రామన్‌కు పద్మశ్రీ పురస్కారం అందించింది. 2016లో ‘నేషనల్ ప్లాంట్ జీనోమ్ సేవియర్’(National Plant Genome Saviour Award) అవార్డు కూడా ఆయనను వరించింది.

రామన్ మృతిపై కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ (VD Satheesan) సంతాపం వ్యక్తం చేశారు. స్వదేశీ వరి వంగడాలను కాపాడటంలో, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అరుదైన విత్తన సంపదను భావితరాలకు అందించేందుకు కృషి చేసిన రామన్ మరణం వ్యవసాయ రంగానికి తీరని లోటు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment