మణిపూర్‌లోని (Manipur) ఇంఫాల్‌లో(Imphal) బీఎస్ఎఫ్(BSF – Border Security Force) క్యాంపులో ఫుడ్ పాయిజనింగ్ (Food Poisoning) ఘటన కలకలం రేపింది. క్యాంపులో ఆహారం తీసుకున్న తర్వాత 75 మందికి పైగా జవాన్లు(Jawans), ఇతర సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకోగా, బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
క్యాంపులో ఉదయం అల్పాహారం (Breakfast) చేసిన కొద్దిసేపటికే పలువురికి వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన అధికారులు బాధితులను ఇంఫాల్‌లోని రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) (RIMS)ఆస్పత్రికి తరలించారు.
అస్వస్థతకు గురైన వారందరికీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని వైద్య వర్గాల సమాచారం వెల్లడిస్తోంది
ఈ ఘటనకు అసలు కారణం ఇంకా తెలియరాలేదు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. క్యాంపులో వడ్డించిన ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాత అస్వస్థతకు కారణం స్పష్టమయ్యే అవకాశం ఉంది.








