తెలంగాణ (Telangana) విద్యుత్ రంగంలో(Power Sector) మరో కీలక ఘట్టం (Milestone) నమోదైందని బీఆర్‌ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో(Yadadri Thermal Power Plant) ఐదో యూనిట్ పవర్ గ్రిడ్‌తో (Fifth Unit Power Grid) అనుసంధానం కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యుత్ రంగంలో సాధిస్తున్న పురోగతికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
మాజీ సీఎం కేసీఆర్(KCR) దార్శనికతతో రూపుదిద్దుకున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని కేటీఆర్ తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమలు, గృహ అవసరాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడంలో ఈ ప్రాజెక్టు ప్రాధాన్యం ఉందన్నారు. ప్లాంట్ పురోగతిలో విద్యుత్ అధికారులు, సిబ్బంది కృషి కీలకమని పేర్కొన్నారు.
గత దశాబ్ద కాలంలో తెలంగాణ విద్యుత్ రంగం గణనీయంగా అభివృద్ధి చెందిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఒకప్పుడు విద్యుత్ కోతలను ఎదుర్కొన్న రాష్ట్రం ప్రస్తుతం 20 వేల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని చేరుకుందని తెలిపారు. యాదాద్రి ప్లాంట్ మరింత సమర్థంగా పనిచేయడం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, విద్యుత్ సరఫరా మెరుగుదలకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
ఐదో యూనిట్ గ్రిడ్‌తో అనుసంధానం కావడం తెలంగాణ విద్యుత్ స్వయంసమృద్ధి దిశగా మరో ముందడుగని కేటీఆర్ పేర్కొన్నారు.








