---Advertisement---

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. విజయ్‌కి మద్దతిచ్చిన ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా…

May 25, 2026

---Advertisement---

తమిళనాడు రాజకీయాల్లో (Tamil Nadu Politics) మరో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాలు క్షణక్షణానికి కొత్త మలుపులు తిరుగుతున్న వేళ, ఇప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో కొత్త సమీకరణాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం అన్నాడీఎంకేకు (AIADMK) చెందిన 3 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సత్యభామ(Sathyabama), మరగాథం(Maragatham), జయకుమార్(Jayakumar) అసెంబ్లీ స్పీకర్ జే.సి.డి. ప్రభాకరన్‌ను (J.C.D. Prabhakaran) కలిసి తమ రాజీనామా లేఖలను సమర్పించారు. ఈ ముగ్గురు ఇటీవల జరిగిన బలపరీక్ష సమయంలో సీఎం విజయ్(CM Vijay) నేతృత్వంలోని టీవీకే పార్టీకి(TVK Party) మద్దతు ప్రకటించడం అప్పట్లోనే చర్చనీయాంశమైంది. ఇప్పుడు నేరుగా రాజీనామా చేయడంతో వీరి రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి.

రాజీనామా అనంతరం ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకే మంత్రి ఆదవ్ అర్జున్‌తో(Aadav Arjun) సమావేశం కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో వీరు త్వరలోనే టీవీకే పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తారా లేదా పరిశీలనలో ఉంచుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఒకవేళ ఈ 3 రాజీనామాలు ఆమోదం పొందితే సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచి ఈస్ట్ నియోజకవర్గంతో (Trichy East Constituency) పాటు మరో 3 స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఏర్పడనుంది. దీంతో తమిళనాడులో మరోసారి రాజకీయ వేడి పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిణామాల వెనుక అసలు వ్యూహం ఏమిటి? విజయ్ పార్టీ మరింత బలపడేందుకు ఇదే తొలి అడుగా? అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment