---Advertisement---

DK Shivakumar: కర్ణాటక సీఎం కాబోతున్న డీకే శివకుమార్… ఎంత సంపద ఉందో తెలుసా?

May 28, 2026

Summarize with AI

---Advertisement---

ఎట్టకేలకు కర్ణాటక రాజకీయాల్లో (Karnataka Politics) కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా (Chief Minister) డీకే శివకుమార్ (DK Shivakumar) ప్రమాణస్వీకారం చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయనున్న నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ (Congress High Command) డీకేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో డీకే శివకుమార్ ఆస్తులు, ఆయన లైఫ్ స్టైల్ (Lifestyle) ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.

కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ఫండర్లలో ఒకరిగా పేరున్న డీకే శివకుమార్ దేశంలోనే అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘానికి (Election Commission) సమర్పించిన అఫిడవిట్‌లో (Affidavit) ఆయన తన ఆస్తుల పూర్తి వివరాలను వెల్లడించారు. అందులో తన కుటుంబ మొత్తం ఆస్తుల విలువ రూ. 1413 కోట్లకు పైగా ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో తమపై రూ. 503 కోట్ల అప్పులు (Debts) కూడా ఉన్నట్లు తెలిపారు.

మై నేతా వెబ్‌సైట్‌లో (MyNeta Website) అప్‌లోడ్ చేసిన అఫిడవిట్ ప్రకారం డీకే శివకుమార్ కుటుంబ సభ్యులకు వివిధ బ్యాంకుల్లో రూ. 16 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. ఆయన వ్యక్తిగత చరాస్తుల విలువ రూ. 244 కోట్లకు పైగా ఉండగా, కుటుంబ చరాస్తుల మొత్తం విలువ రూ. 273 కోట్లకు మించి ఉందని వెల్లడించారు. ఇక స్థిరాస్తుల విలువ దాదాపు రూ. 970 కోట్లుగా ప్రకటించారు.

డీకే శివకుమార్‌కు షాపింగ్ మాల్స్(Shopping Malls), భారీ కమర్షియల్ ప్రాపర్టీలు (Commercial Properties), ఖరీదైన భవనాలు (Luxury Buildings) ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ముఖ్యంగా బెంగళూరులో ఉన్న గ్లోబల్ మాల్ (Global Mall) విలువ ఒక్కటే సుమారు రూ. 900 కోట్లుగా అంచనా వేస్తున్నారు. దీనితో పాటు కోట్ల విలువైన దుకాణాలు, వాణిజ్య భవనాలు కూడా ఆయన కుటుంబానికి ఉన్నట్లు సమాచారం.

స్టాక్ మార్కెట్‌లో (Stock Market) కూడా డీకే భారీగా పెట్టుబడులు పెట్టారు. అనేక కంపెనీల్లో కలిపి రూ. 4.20 కోట్ల పెట్టుబడులు ఉన్నట్లు వెల్లడించారు. అదేవిధంగా రూ. 9 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు (Fixed Deposits) కూడా ఉన్నాయని తెలిపారు. బంగారం, వెండి, వజ్రాలు వంటి విలువైన ఆభరణాలతో పాటు లక్షల రూపాయల విలువైన రోలెక్స్, హుబ్లోట్ వాచీలు కూడా ఆయన వద్ద ఉన్నాయి.

డీకే శివకుమార్, ఆయన భార్య, పిల్లల ఆభరణాల మొత్తం విలువ రూ. 3.82 కోట్లకు పైగా ఉంటుందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆయన భార్య పేరుపై రూ. 30 కోట్ల విలువైన వ్యవసాయ భూమి కూడా ఉంది. అదనంగా ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో రూ. 84 కోట్లకు పైగా విలువైన ఇళ్లు, ఫ్లాట్లు ఉన్నట్లు వెల్లడించారు.

రాజకీయాల్లో పవర్ ఫుల్ లీడర్‌గా పేరున్న డీకే శివకుమార్ ఇప్పుడు కర్ణాటక సీఎం కుర్చీ ఎక్కబోతుండటంతో ఆయన సంపద, వ్యాపార సామ్రాజ్యం, రాజకీయ ప్రభావంపై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment