---Advertisement---

ఇంట్లోనే సీఎం విజయ్ విగ్రహం.. పూజలు చేస్తున్న అభిమాని వీడియో వైరల్!

June 3, 2026

---Advertisement---

తమిళనాడు రాజకీయాల్లో, సినీ రంగంలో భారీ క్రేజ్ సంపాదించుకున్న సీఎం విజయ్‌పై ఓ అభిమాని చూపించిన భక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా విజయ్ విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి ప్రతిరోజూ పూజలు చేస్తున్న ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

తిరుచ్చికి చెందిన సుకుమార్ షణ్ముగం అనే టీవీకే పార్టీ కార్యకర్త తన ఇంటి పూజ మందిరంలో సీఎం విజయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. ప్రతి రోజు హారతి ఇవ్వడం, బొట్టు పెట్టడం, ప్రత్యేక ప్రార్థనలు చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

కొంతమంది అభిమానులు విజయ్‌పై ఉన్న ప్రేమను ప్రశంసిస్తుండగా, మరికొందరు మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సినిమా హీరోలు లేదా రాజకీయ నాయకులపై అభిమానం ఉండటం సహజమే కానీ అది పిచ్చి స్థాయికి చేరకూడదని కామెంట్లు చేస్తున్నారు.

దేవుళ్లకు లేదా తల్లిదండ్రులకు విగ్రహాలు పెట్టుకోవడం సరికానీ, అభిమాన హీరో లేదా నాయకుడి విగ్రహాన్ని పూజ గదిలో పెట్టి పూజలు చేయడం అతిశయోక్తి అంటూ మండిపడుతున్నారు. గతంలో కూడా పలువురు హీరోలు, హీరోయిన్లకు అభిమానులు విగ్రహాలు ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయని, కానీ వాటివల్ల సాధించినది ఏమీలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వస్తుండగా, విజయ్ అభిమానులు దీన్ని గర్వంగా షేర్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment