సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాటలు పూర్తిగా బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. అధికారంలోకి వచ్చి 2న్నరేళ్లు గడిచినా పాలమూరు ప్రాంతానికి కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఎలాంటి మేలు చేయలేదని ఆయన ఆరోపించారు. ఒక న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన హరీశ్ రావు, బీఆర్ఎస్(BRS) చేపట్టిన పాదయాత్ర భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు స్పందిస్తున్నారని అన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు సీఎం రేవంత్ రెడ్డికి లేదని హరీశ్ రావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో (Andhra Pradesh CM Chandrababu) కుమ్మక్కై తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ 75 శాతం నీటిని వినియోగించుకోగా, తెలంగాణకు కేవలం 25 శాతం నీరు మాత్రమే దక్కిందని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) పూర్తిగా విఫలమయ్యారని, వెంటనే తెలంగాణ ప్రజలకు (People of Telangana) క్షమాపణలు (Apology) చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని గుర్తు చేశారు. పాలమూరు రైతులకు(Farmers) కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హామీలు అమలు కాలేదని విమర్శించారు.
కొడంగల్ నియోజకవర్గంలో మరోసారి రేవంత్ రెడ్డిని ఓడించడం ఖాయమని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు ప్రాంతంలో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు.







