తమిళనాడు రాజకీయాలు (Tamil Nadu Politics) ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ చుట్టూనే తిరుగుతున్నాయి. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సీఎం విజయ్ (CM Vijay) అతి తక్కువ సమయంలోనే ప్రజాదరణ సంపాదించి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు. ఇదే సమయంలో ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్(Raghava Lawrence) కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ (Politic Entry) ఇవ్వబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం (Trichy East Constituency) నుంచి లారెన్స్ పోటీ చేయనున్నారనే వార్తలు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఊహాగానాలపై తాజాగా ఎక్స్ వేదికగా స్పందించిన లారెన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.
జూన్ 11న కీలక ప్రకటన:
రాఘవ లారెన్స్ తన ట్వీట్లో స్పందిస్తూ.. తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో నేను పోటీ చేస్తున్నాననే వార్తలు పలు మీడియా వేదికల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయని తెలిపారు. ఈ విషయంపై స్పష్టత కోరుతూ అనేక మంది మీడియా ప్రతినిధులు తనను సంప్రదిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి తాను స్పందించాల్సిన స్థాయికి చేరుకుందని భావించి ఈ ప్రకటన చేస్తున్నానన్నారు. ప్రస్తుతం ‘బెంజ్’(Benz) సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానని, ఈ నెల 10తో షూటింగ్ పూర్తి అవుతుందని వెల్లడించారు. తన తల్లి(Mother) ఆశీస్సులతో తన జీవితానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన నిర్ణయాన్ని జూన్ 11 గురువారం ఉదయం 9:30 గంటలకు ప్రకటిస్తానని ట్వీట్ చేశారు. దీంతో లారెన్స్ రాజకీయ ప్రవేశంపై మరింత ఆసక్తి నెలకొంది.
Hi everyone, News about me contesting in Trichy East election has been circulating across various media platforms.
— Raghava Lawrence (@offl_Lawrence) June 7, 2026
All my Media friends have been reaching out to me over phone and requesting to meet me asking for clarification. Since the speculation has grown to a point where I… pic.twitter.com/68ZyN6P0l9
త్రిషకు అవకాశం లేనట్టేనా?:
టీవీకే (TVK) అధినేత సీఎం విజయ్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో 2 స్థానాల్లో పోటీ చేసి రెండు చోట్లా ఘన విజయం సాధించారు. దీంతో రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గానికి ఆయన రాజీనామా సమర్పించారు. ఈ స్థానాన్ని మరోసారి తమ ఖాతాలోనే నిలుపుకోవాలని భావిస్తున్న టీవీకే అధిష్టానం బలమైన అభ్యర్థి కోసం వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.
ప్రజల్లో (Public) మంచి గుర్తింపు, సేవా కార్యక్రమాలతో (Social Service Activities) ప్రత్యేక ఇమేజ్ కలిగిన రాఘవ లారెన్స్ వైపు విజయ్ మొగ్గు చూపుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు ఈ స్థానం నుంచి ప్రముఖ నటి త్రిషను (Trisha) బరిలోకి దింపుతారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం టీవీకే నాయకత్వం మాత్రం రాఘవ లారెన్స్ పేరునే సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 11న లారెన్స్ చేసే ప్రకటనతో ఈ రాజకీయ సస్పెన్స్‌కు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.








